Begin typing your search above and press return to search.

'సలార్'.. రాబోయే ఆ సినిమాలపై ఇంపాక్ట్?

'సలార్' సక్సెస్ ఎన్టీఆర్, ప్రభాస్ రాబోయే సినిమాలపై ఇంపాక్ట్ చూపించనుందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది

By:  Tupaki Desk   |   30 Nov 2023 3:30 AM GMT
సలార్.. రాబోయే ఆ సినిమాలపై ఇంపాక్ట్?
X

'సలార్' సక్సెస్ ఎన్టీఆర్, ప్రభాస్ రాబోయే సినిమాలపై ఇంపాక్ట్ చూపించనుందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ మరో నెల రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు మేకర్స్. తాజాగా సలార్ మూవీకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు ప్రశాంత్ నీల్.

సలార్ టీజర్ వచ్చినప్పటి నుంచి ఈ మూవీ కేజిఎఫ్ యూనివర్స్ లో భాగమని అనేక వార్తలు వచ్చాయి. కానీ తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దాన్ని ఖండించారు. సలార్ పార్ట్-2 నిడివి ఎక్కువ ఉండడంతోనే సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేసేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. సలార్ పార్ట్ 2 సుమారు 6 గంటల నిడివి ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రశాంత్ నీల్ వెల్లడించారు.

సాధారణంగా ఓ సినిమా రెండు భాగాలుగా వస్తుందంటే ఫస్ట్ పార్ట్ వచ్చిన వెంటనే రెండో పార్ట్ రిలీజ్ అవ్వాలి. ఇప్పటివరకు రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి, కేజిఎఫ్, కాంతార, పుష్ప సిరీస్ లు ఫస్ట్ పార్ట్ వచ్చిన వెంటనే సెకండ్ పార్ట్ రిలీజ్ అయ్యాయి. మధ్యలో ఏ హీరో మరో సినిమా చేయలేదు. కానీ సలార్ పార్ట్-1 రిలీజ్ తర్వాత అటు ప్రశాంత్ నీల్ ఇటు ప్రభాస్ ఇతర సినిమాలకు డేట్స్ ఇచ్చారు. సలార్ పార్ట్-1 తర్వాత ప్రభాస్ కల్కి2898AD, మారుతి, స్పిరిట్ సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటాడు. వీటితోపాటు ఇటీవల హను రాఘవపూడితో ఓ ప్రాజెక్టు కూడా కమిట్ అయ్యాడు.

అటు ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్-1 తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడు. సాధారణంగా పార్ట్-1 భారీ సక్సెస్ సాధిస్తే ఆడియన్స్ అంతా పార్ట్-2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కాబట్టి సలార్ పార్ట్-1 కూడా భారీ సక్సెస్ అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బాహుబలి, కేజిఎఫ్, సిరీస్ ల1 తరహాలో సలార్ పార్ట్-1 సక్సెస్ అయితే ప్రశాంత్ నీల్ తన ప్లాన్ మార్చుకొని సలార్ పార్ట్-2 ను సెట్స్ పైకి తీసుకెల్లే అవకాశం ఉంది.

దీన్నిబట్టి సలార్ సక్సెస్ మీదే ప్రభాస్, ఎన్టీఆర్ తదుపరి సినిమాలు ఆధారపడి ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఒకవేళ సలార్ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అవ్వకపోతే ముందు అనుకున్న దాని ప్రకారం ప్రభాస్ తన కమిట్మెంట్స్ పూర్తి చేస్తాడు. ప్రశాంత్ నీల్ వెంటనే ఎన్టీఆర్ తో సినిమా స్టార్ట్ చేస్తాడు. మరి డిసెంబర్ 22న రిలీజ్ అవ్వబోతున్న సలార్ పార్ట్-1 సీజ్ ఫైర్ ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుతో చూడాలి.