Begin typing your search above and press return to search.

సలార్ 1 డామినేషన్.. ఆ రోజు నుంచే మొదలు!

ఆగస్టు 15 లోపు సలార్ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారంట.

By:  Tupaki Desk   |   25 July 2023 11:30 AM GMT
సలార్ 1 డామినేషన్.. ఆ రోజు నుంచే మొదలు!
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ సలార్. హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తోంది. రెండు భాగాలుగా సలార్ సిరీస్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా సలార్ 1 సీజ్ ఫైర్ మూవీ సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.

ఇప్పటివరకు ఈ సినిమా నుంచి కేవలం టీజర్ మాత్రమే వచ్చింది. టీజర్ ని కాస్త గ్రాండ్ గానే రిప్రెజెంట్ చేసిన ఫ్యాన్స్ నుంచి ఆశించిన స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ రాలేదని చెప్పాలి. ఇంతలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న కల్కి 2898 ఏడీ మూవీకి సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. దీంతో ఆడియన్స్ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఆ సినిమా వైపు వెళ్ళిపోయింది.

అయితే సలార్ 1 మూవీ రిలీజ్ కి టైం దగ్గర పడుతోంది. ఇప్పటి చాలా వరకు బిజినెస్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఆదిపురుష్ డిజాస్టర్ తర్వాత రాబోతున్న సినిమా కావడంతో డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం సలార్ 1పై చాలా హోప్స్ పెట్టుకున్నారు. వాటిని రీచ్ అవ్వాలంటే కచ్చితంగా సినిమా ప్రమోషన్ విషయంలో మరింత స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాట.

ప్రశాంత్ నీల్ కూడా అదే దిశలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ నెల ఆఖరులో లేదంటే ఆగస్టు 15 లోపు సలార్ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారంట.

మరోవైపు డబ్బింగ్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కూడా రిపీటెడ్ గా ఇవ్వడానికి ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తూ ఉన్నారు.

ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్ట్రాంగ్ ప్రమోషన్ ఉంటే ఓపెనింగ్స్ గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఆదిపురుష్ ఇంపాక్ట్ ఎంతో కొంత సలార్ పై పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్న మాట.