Begin typing your search above and press return to search.

సంక్రాతి రేసులో సలార్ లేనట్లే.. ఇక అప్పుడే..

సలార్ చిత్రం సంక్రాంతి వస్తుందని ఎక్స్ పెక్ట్ చేసిన కూడా మార్చి 22న రిలీజ్ చేసే ఆలోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నారంట.

By:  Tupaki Desk   |   24 Sep 2023 12:30 AM GMT
సంక్రాతి రేసులో సలార్ లేనట్లే.. ఇక అప్పుడే..
X

సంక్రాంతి సీజన్ అంటే టాలీవుడ్ లో అతిపెద్ద సినిమా పండగ. తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి బిగ్ ఫెస్టివల్ కావడంతో ఆ టైంలోనే సినిమాలు కూడా ఎక్కువగా రిలీజ్ చేయడానికి దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపిస్తారు. స్టార్ హీరోలు కూడా అదే డేట్ ఎక్కువగా కోరుకుంటారు. ఈ సారి కూడా వచ్చే ఏడాది సంక్రాంతి ఫెస్టివల్ కి ఇప్పటి నుంచే గట్టి పోటీ ఉంది. కొందరు స్టార్ హీరోలు ఆ టైంలో తమ సినిమాలు రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నా వర్క్ అవుట్ కాలేదు.

అయితే కొందరు మాత్రం పెర్ఫెక్ట్ ప్లాన్ తో సినిమాలు రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. వీటిలో సంక్రాంతి కచ్చితంగా వచ్చే చిత్రాల జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం ఉంది. ఇప్పటికే మహేష్ బాబు కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. అలాగే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సూపర్ హీరో మూవీ హనుమాన్ కూడా సంక్రాంతికి కచ్చితంగా వచ్చే సినిమాల లిస్టులో ఉంది. ఈ రెండు జనవరి 12న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి.

మాస్ మహారాజ్ రవితేజ, కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో చేస్తోన్న ఈగల్ మూవీ జనవరి 10న రిలీజ్ చేయబోతున్నట్లు డేట్ ఎనౌన్స్ చేసిన అప్పటికి వచ్చేది రానిది ఇంకా క్లారిటీ లేదు. సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ బట్టి మరల డేట్ డిసైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే కింగ్ నాగార్జున నా సామి రంగా కూడా సంక్రాంతికి జనవరి 14న రానున్నట్లు ఒక ప్రీటీజర్ తో ఎనౌన్స్ చేశారు.

రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అయితే ఆ టైంకి ఫస్ట్ కాపీ సిద్ధం చేయగలరా అనేది వేచి చూడాలి. విజయ్ దేవరకొండ పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మూవీ కూడా జనవరి 13న రిలీజ్ చేసే ఆలోచనలో దిల్ రాజు ఉన్నారు. అయితే ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం లేదు. శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కుతోన్న తమిళ్ మూవీ అయలన్ కూడా సంక్రాంతి రేసులో ఉంది.

సలార్ చిత్రం సంక్రాంతి వస్తుందని ఎక్స్ పెక్ట్ చేసిన కూడా మార్చి 22న రిలీజ్ చేసే ఆలోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నారంట. ఇప్పటి వరకు అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిన చిత్రాలు రెండు ఉండగా, రేసులో మరో నాలుగు చిత్రాలు ఉన్నాయి. మరి వీటిలో ఏది పోటీలో నిలబడుతుందనేది చూడాలి.