Begin typing your search above and press return to search.

రికార్డ్ ధ‌ర‌కు స‌లార్ ఓటీటీ హ‌క్కులు

థియేట్రికల్ రిలీజ్ లు - శాటిలైట్ రైట్స్ నుండి వచ్చే ఇత‌ర‌ ఆదాయం భారీ బోన‌స్ గా మారుతుంద‌ని టాక్ వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   14 July 2023 2:59 PM GMT
రికార్డ్ ధ‌ర‌కు స‌లార్ ఓటీటీ హ‌క్కులు
X

ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా 'కేజీఎఫ్' ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం - స‌లార్. ఈ సినిమా టీజ‌ర్ 48 గంట‌ల్లోనే 10 కోట్ల వ్యూస్ తో సంచ‌ల‌నం సృష్టించింది. అందుకు త‌గ్గ‌ట్టే మార్కెట్లో డిమాండ్ హైప్ నెల‌కొన్నాయి. తాజా స‌మాచారం మేర‌కు.. స‌లార్ డిజిటల్ హక్కుల కోసం స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ ల మధ్య తీవ్రమైన పోటీ నెల‌కొంద‌ని తెలుస్తోంది.

ప్రముఖ OTT దిగ్గజం సౌత్ భాష‌లు స‌హా హిందీ భాషల స్ట్రీమింగ్ హక్కులను పొందేందుకు ఒక ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ప్ర‌య‌త్నిస్తోంద‌ని తెలిసింది. OTT ప్లాట్ ఫారమ్ ఈ హక్కుల కోసం భారీ ధ‌ర‌ను కోట్ చేస్తోంద‌ట‌.

ఈ డీల్ విలువ దాదాపు 200 కోట్ల వరకు ఉంటుందని పుకార్లు షికార్ చేస్తున్నాయి. స‌లార్ డిజిటల్ హక్కులను కొనుగోలు చేయడం కోసం బ‌డా సంస్థ‌ల న‌డుమ పోటీని చూస్తుంటే.. స్ట్రీమింగ్ పరిశ్రమలో ఈ సినిమాకి ఉన్న డిమాండ్ ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

తాజా డీల్ పూర్త‌యితే నిర్మాతలు తమ పెట్టుబడిలో మెజారిటీ భాగాన్ని తిరిగి దండుకున్న‌ట్టేన‌ని కూడా చెబుతున్నారు. సుమారు 80 నుండి 90 శాతం వరకు వారి చేతికి వ‌చ్చేసిన‌ట్టేన‌ని చెబుతున్నారు.

థియేట్రికల్ రిలీజ్ లు - శాటిలైట్ రైట్స్ నుండి వచ్చే ఇత‌ర‌ ఆదాయం భారీ బోన‌స్ గా మారుతుంద‌ని టాక్ వినిపిస్తోంది. స‌లార్ భారీ యాక్షన్ తో కూడిన గ్యాంగ్ స్టర్ ఎంటర్‌టైనర్ అన్న సంగ‌తి టీజ‌ర్ తో స్ప‌ష్ఠ‌మైంది. విడుదలకు ముందే వినోద పరిశ్రమలో అలలు సృష్టిస్తోంది.

సెప్టెంబరు 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి కేవలం రెండు నెలల సమయం ఉన్నందున అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అందుకు త‌గ్గ‌ట్టే భారతీయ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద స‌లార్ రికార్డులను బద్దలు కొడుతుందని అభిమానులు అంచనా వేస్తున్నాయి.

జూలై 6న విడుదలైన ఈ సినిమా టీజర్ కేవలం 24 గంటల్లోనే 83 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ఇప్పటికే రికార్డులను బద్దలు కొట్టింది. ఒక్క రోజులో అత్యధికంగా వీక్షించిన భారతీయ సినిమా ట్రైలర్ గా ఇది అరుదైన‌ రికార్డ్. ఇది అంచనాలను మరింత పెంచింది. ఈ చిత్రంలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటించారు.

మన్నార్ పాత్రను వరదరాజులు పోషించనుండగా జగపతి బాబు- శృతి హాసన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స‌లార్ ట్రైలర్ ను ఆగస్టులో విడుదల చేయనున్నట్లు హోంబ‌లే సంస్థ‌ ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ప్రతి అప్ డేట్ తో స‌లార్ చుట్టూ ఉన్న హైప్ పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలను పెంచుతోంది.