Begin typing your search above and press return to search.

సలార్‌ OST ఔట్‌... ఫ్యాన్స్ కి పండగే పండగ

దాదాపుగా వెయ్యి కోట్ల వసూళ్లను రాబట్టిన సలార్‌ సినిమాలోని బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ బాగా పాపులారిటీని సొంతం చేసుకుంది

By:  Tupaki Desk   |   3 May 2024 7:36 AM GMT
సలార్‌ OST ఔట్‌... ఫ్యాన్స్ కి పండగే పండగ
X

ప్రభాస్ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొంది గత ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్‌ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపుగా వెయ్యి కోట్ల వసూళ్లను రాబట్టిన సలార్‌ సినిమాలోని బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ బాగా పాపులారిటీని సొంతం చేసుకుంది.

సలార్ ఓటీటీ లో వచ్చిన తర్వాత ప్రభాస్‌ ఎలివేషన్‌ సన్నివేశాలకు సంబంధించిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ మరియు మ్యూజిక్ బిట్స్ ను సోషల్‌ మీడియాలో విపరీతంగా వినియోగించారు. రవి బస్రూర్ అందించిన ఈ బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్ కి ఉన్న స్పందన నేపథ్యంలో ఒరిజినల్‌ సౌండ్ ట్రాక్ (OST) ను విడుదల చేశారు.

చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమా బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కి సోషల్‌ మీడియాలో ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మ్యూజిక్ ప్లాట్‌ ఫామ్స్ ద్వారా OST ఆల్బం ను విడుదల చేయడం జరిగింది. దాంతో ఆ ఒరిజినల్‌ మ్యూజిక్ బిట్స్ ను ఉపయోగించి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ రీల్స్ చేయవచ్చు.

ఈ మధ్య కాలంలో స్టార్‌ హీరోల సినిమాల యొక్క OST లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడం కామన్‌ విషయం అయ్యింది. సలార్‌ సినిమాకు సీక్వెల్‌ రావాల్సి ఉంది. సీక్వెల్‌ వచ్చే వరకు సలార్‌ గురించి జనాలు మాట్లాడుకోవాలంటే సోషల్‌ మీడియాలో OST తో రీల్స్ తప్పనిసరి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఏ ఉద్దేశ్యంతో సలార్‌ OST ట్రాక్‌ ను విడుదల చేసినా కూడా కచ్చితంగా ఫ్యాన్స్ కి పండగే అనడంలో సందేహం లేదు. సలార్ ను సోషల్‌ మీడియాలో రాబోయే ఏడాది కాలం పాటు ఈ OST ట్రాక్ లు ఉండేలా చేస్తాయి అని విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు.

సలార్‌ లో ప్రభాస్ హీరోగా నటించగా శృతి హాసన్‌, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రియా రెడ్డి ఇంకా పలువురు స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు. సలార్‌ 1 ను మించి సలార్‌ 2 సినిమా ఉంటుంది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. ఇప్పటికే సలార్‌ 2 షూట్ ను మొదలు పెట్టినట్లుగా సమాచారం అందుతోంది.