Begin typing your search above and press return to search.

సలార్ ఓపెనింగ్ టార్గెట్..బాక్సాఫీస్ బ్లాస్టే!

అది రిలీజ్ అయితే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే మిలియన్ డాలర్స్ క్రాస్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదని ట్రేడ్ పండితులు అంటున్నారు.

By:  Tupaki Desk   |   23 Aug 2023 3:57 AM GMT
సలార్ ఓపెనింగ్ టార్గెట్..బాక్సాఫీస్ బ్లాస్టే!
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ సలార్. ఈ భారీ బడ్జెట్ తో హై ఎక్స్ పెక్టేషన్స్ మధ్యలో ఈ మూవీ సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఆదిపురుష్ డిజాస్టర్ అయిన కూడా సలార్ పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. దీనికి కారణం కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తోన్న ప్రాజెక్ట్ కావడమే.

ఈ మూవీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే టీం నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు. రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. గట్టిగా చూసుకుంటే నెల రోజులు మాత్రమే ఉంది. ఇండియాలో ఐదు భాషలతో పాటు ఇంగ్లీష్ వెర్షన్ కూడా రిలీజ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దానికోసమే ప్రశాంత్ నీల్ కాస్తా ఎక్కువ టైం తీసుకుంటున్నట్లు టాక్.

అయితే ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలకి మించి మూవీ ఉంటుందనే మాట వినిపిస్తోంది. ఇండియా కాకుండా ఇతర దేశాలలో కూడా భారీ స్క్రీన్స్ లో సలార్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. యూఎస్ లో అయితే 40K డాలర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే దాటిపోయాయి. ట్రైలర్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు.

అది రిలీజ్ అయితే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే మిలియన్ డాలర్స్ క్రాస్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఆదిపురుష్ ని ప్రభాస్ కెరియర్ లోనే హైయెస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. సలార్ కి అంతకు మించి జరగొచ్చని భావిస్తున్నారు. అలాగే మొదటి రోజే ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ ని టచ్ చేసే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.

ఒక 200 కోట్ల గ్రాస్ మొదటి రోజు అందుకుంటే మాత్రం కచ్చితంగా అది రికార్డ్ అవుతుంది. ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ సినిమా మాత్రమే ఫస్ట్ డే 200 కోట్ల కలెక్షన్ మార్క్ ని దాటింది. ఇప్పుడు ఆ ఛాన్స్ సలార్ మూవీకి వచ్చింది. మరి ప్రశాంత్ నీల్, ప్రభాస్ ఈ చిత్రంతో ఎలాంటి మాయ చేస్తారో అనేది వేచి చూడాలి.