Begin typing your search above and press return to search.

సలార్ బిజినెస్​.. ఈ టార్గెట్ పెద్ద రిస్కే

తాజాగా ఉత్తర అమెరికాలో సలార్ రికార్డ్ బిజినెస్ చేసినట్లు వార్త బయటకు వచ్చింది. అక్కడ గతంలో ఆర్​ఆర్​ఆర్​ సినిమా రైట్స్ ఏకంగా రూ.40కోట్ల వ్యాపారం చేసింది.

By:  Tupaki Desk   |   20 Sep 2023 6:34 AM GMT
సలార్ బిజినెస్​.. ఈ టార్గెట్ పెద్ద రిస్కే
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్​టైనర్ చిత్రం 'సలార్‌'పై ఊహించని రేంజ్​లో అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా పడటంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే ఈ చిత్ర రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానుల కోసం తాజాగా ఓ వార్త అందింది. అదేంటంటే.. ఈ సినిమా రికార్డ్ బిజినెస్​ చేసినట్లు తెలిసింది.

వివరాళ్లోకి వెళితే.. సలార్ చిత్రం సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్​ అవుతుందని మొదట ప్రకటించడంతో.. ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్​ కూడా భారీగా జరిగాయి. రికార్డు లెవెల్లో టికెట్ల విక్రయాలు జరిగాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఉత్తర అమెరికాలో అయితే 600K డాలర్లు(సుమారు రూ. 5 కోట్లు) వసూలు ఆయ్యాయని వార్తలు కూడా వచ్చాయి. అయితే సలార్ సినిమా వాయిదా పడటంతో పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. ప్రీ

తాజాగా ఉత్తర అమెరికాలో సలార్ రికార్డ్ బిజినెస్ చేసినట్లు వార్త బయటకు వచ్చింది. అక్కడ గతంలో ఆర్​ఆర్​ఆర్​ సినిమా రైట్స్ ఏకంగా రూ.40కోట్ల వ్యాపారం చేసింది. ఇప్పటి వరకు ఓ తెలుగు సినిమా ఆ రేంజ్​లో బిజినెస్​ అవ్వడం అదే తొలిసారి. ఇప్పుడు సలార్​ దాదాపుగా ఆ నెంబర్​ దగ్గరకు వెళ్లింది. 4.5 మిలియన్ డాలర్ల వ్యాపారం చేసుకుందని తెలిసింది. అంటే రూ.36 కోట్లు. ఆర్​ఆర్​ఆర్​ తర్వాత నార్త్​ అమెరికాలో సెకండ్ లార్జెస్ట్ డీల్​గా నిలిచింది. ఈ లెక్క ప్రకారం థియేటర్ల మెయిన్​టైనెన్స్, కమిషన్స్​, ఇతర ప్రమోషన్స్​ ఖర్చులు కలిపి​ సలార్ బ్రేక్ ఈవెన్​ టార్గెట్​ 9-10 మిలియన్ డాలర్స్​.

ప్రభాస్ గత మూడు ఫ్లాప్ చిత్రాలు ఉత్తర అమెరికాలో లాంగ్​ రన్ టైమ్​లో 3 మిలియన్​ డాలర్ల మార్క్​ను దాటాయి. ఆదిపురుష్ 3.1 మిలియన్ డాలర్స్​, రాధేశ్యామ్​ 2.2 మిలియన్ డాలర్స్, సాహో 3.3మిలియన్స్ డాలర్స్​ వరకు వసూళ్లను అందుకున్నాయి. ఈ మూడు చిత్రాల రిజల్ట్​ను బట్టి చూస్తే.. ప్రభాస్ 10 మిలియన్ డాలర్స్​ మార్క్​ను అందుకుంటాడా అనేది అనుమానంగానూ, ఆసక్తికరంగానూ మారింది.

మరోవైపు సలార్​ దర్శకుడు ప్రశాంత్ నీల్​ ఇప్పటికే తన గత చిత్రాలతో భారీ సక్సెస్​లను అందుకున్నాడు. అయినప్పటికీ.. సలార్ చిత్రం 10 మిలయన్ డాలర్స్ మార్క్​ను అందుకోవడం అంటే పెద్ద టాస్కే అని చెప్పాలి. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇకపోతే ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చేది.. ఈ ఏడాది నవంబర్ లేదా వచ్చే ఏడాది సంక్రాంతి, ఇండిపెండెన్స్ డే అని అంటున్నారు.