Begin typing your search above and press return to search.

సలార్ నైజాం రేటు.. ఎంత వస్తే సేఫ్?

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబందించిన నైజాం రైట్స్ ఏకంగా 90 కోట్లకి వెళ్ళినట్లు టాక్ వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   26 Nov 2023 3:57 AM GMT
సలార్ నైజాం రేటు.. ఎంత వస్తే సేఫ్?
X

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా సలార్. ఈ మూవీ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషలలో రిలీజ్ అవ్వనుంది. భారీ బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ మూవీలో పార్ట్ 1 డిసెంబర్ లో థియేటర్స్ లోకి వస్తోంది.

ఈ సినిమా థీయాట్రికల్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా కంప్లీట్ అయ్యింది. అన్ని భాషలలో భారీ ధరకి రైట్స్ అమ్ముడయ్యాయి. గతంలో చేసుకున్న డీల్స్ మార్చి మళ్ళీ కొత్తగా బిజినెస్ డీల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబందించిన నైజాం రైట్స్ ఏకంగా 90 కోట్లకి వెళ్ళినట్లు టాక్ వినిపిస్తోంది.

ఇందులో 25 కోట్ల రిటర్న్ బుల్ అడ్వాన్స్, 65 కోట్ల నాన్ రిటర్న్ బుల్ అడ్వాన్స్ ఉందంట. అలాగే జీఎస్టీ పార్ట్ 13 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ లెక్కలన్నీ చూసుకుంటే థియేటర్స్ లో సలార్ మూవీ 55 కోట్లు షేర్ వసూళ్లు చేస్తే బయ్యర్ సేఫ్ జోన్ లోకి వచ్చేస్తాడు. సలార్ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ హైప్ నెలకొని ఉంది.

ఈ లెక్కన చూసుకుంటే రికార్డ్ ఓపెనింగ్స్ రావడం గ్యారెంటీ. ఆ పైన ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది అనేది మూవీకి వచ్చే టాక్ పైన ఆధారపడి ఉంటుంది. డార్లింగ్ ఫ్యాన్స్ అయితే మాత్రం కచ్చితంగా సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. సలార్ తో ప్రభాస్ సాలిడ్ హిట్ ని ఖాతాలో వేసుకుంటారని భావిస్తున్నారు.

బాహుబలి 2 తర్వాత ప్రభాస్ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. ఆ లోటు సలార్ తో తీరిపోతుందని భావిస్తున్నారు. మరి అది ఎంత వరకు సాధ్యమై డిస్టిబ్యూటర్స్ ని సలార్ లాభాలు తెచ్చి పెడుతుందనేది చూడాలి. సలార్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్లకి పైగా కలెక్ట్ చేస్తుందని నిర్మాత అంచనా వేస్తున్నారు. కేజీఎఫ్ చాప్టర్ 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తోన్న మూవీ కావడం తో ఎక్స్ పెక్టేషన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి.