Begin typing your search above and press return to search.

సలార్.. ఆ ఏరియాలో టార్గెట్ ఫినిష్

ఇదిలా ఉంటే ఇప్పుడు సలార్ ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ని నైజాం ఏరియాలో సాధించబోతోంది. నైజాంలో సలార్ మూవీని 60 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ చేశారు.

By:  Tupaki Desk   |   28 Dec 2023 3:30 AM GMT
సలార్.. ఆ ఏరియాలో టార్గెట్ ఫినిష్
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోన్న మూవీ సలార్. ఈ సినిమా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ దిశగా తన జర్నీ కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్లకి పైగా కలెక్షన్స్ ని కొల్లగొట్టింది.ప్రస్తుతం కలెక్షన్స్ నిలకడగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో అయితే ఫ్యాన్స్ కి చాలా రోజుల తర్వాత ఫుల్ మీల్స్ ట్రీట్ సలార్ తో దొరికింది.

బాహుబలి 2 తర్వాత ఆ స్థాయి సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇప్పుడు సలార్ తో ఆ కోరిక తీరేలానే కనిపిస్తోంది. క్రిస్మస్ సెలవుల తర్వాత కలెక్షన్స్ కాస్తా తగ్గిన కూడా నార్త్ ఇండియాలో మెల్లగా పుంజుకుంటుంది. ఆరంభంలో డంకీ సినిమా కారంగా థియేటర్స్ ఆశించిన స్థాయిలో దొరకలేదు.

అయితే డంకీకి అనుకున్న స్థాయిలో పాజిటివ్ టాక్ రాకపోవడం, అలాగే రోజు రోజుకి సలార్ కి ఆడియన్స్ పెరుగుతూ ఉండటంతో డంకీ మూవీ ఆడుగుతున్న థియేటర్స్ లో సలార్ ని రిప్లేస్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు సలార్ ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ని నైజాం ఏరియాలో సాధించబోతోంది. నైజాంలో సలార్ మూవీని 60 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ చేశారు.

ఐదు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 59.17 కోట్ల షేర్ అందుకుంది. ఆరో రోజు కూడా చాలా థియేటర్స్ లో ఆడియన్స్ ఫుల్ అయ్యి కనిపించారు. మల్టీ ప్లెక్స్ లో కంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో ఆడియన్స్ ఎక్కువగా ఉండటం విశేషం. ఈ లెక్కన చూసుంటే ఆరో రోజుకి నైజాంలో సలార్ మూవీ బ్రేక్ ఈవెన్ అయిపోతుంది.

ఆ తరువాత వచ్చే కలెక్షన్స్ అన్ని లాభాలుగానే ఉంటాయి. ఇక ఆంధ్రాలో కూడా సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అయితే అక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎక్కువ ఉండటం, టికెట్ ధరలు నామమాత్రంగానే ఉండటంతో కాస్తా ఆలస్యం కావొచ్చు. కాని బ్రేక్ ఈవెన్ అందుకోవడం మాత్రం పక్కా. ఇక హిందీ బెల్ట్ లో కూడా వంద కోట్ల గ్రాస్ ని ఆరో రోజు సలార్ మూవీ టచ్ క్రాస్ చేసేలా కనిపిస్తోంది.