Begin typing your search above and press return to search.

'సలార్'.. మైత్రి నైజాం కోరికలు

ఈ క్రమంలోనే సలార్ మూవీని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సలార్ మూవీ టికెట్ రేట్లు పెంచుకోవడానికి, అలాగే స్పెషల్ షోస్ పర్మిషన్ కోసం తెలంగాణ ప్రభుత్వానికి అభ్యర్థించింది.

By:  Tupaki Desk   |   14 Dec 2023 1:04 PM GMT
సలార్.. మైత్రి నైజాం కోరికలు
X

టాలీవుడ్ అగ్ర హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్' మూవీ మరో ఎనిమిది రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాయి.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ సలార్ ని భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే సలార్ మూవీని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సలార్ మూవీ టికెట్ రేట్లు పెంచుకోవడానికి, అలాగే స్పెషల్ షోస్ పర్మిషన్ కోసం తెలంగాణ ప్రభుత్వానికి అభ్యర్థించింది. ఆ అభ్యర్థనలను పరిశీలిస్తే.. సింగిల్ స్క్రీన్స్ తో పాటు మల్టీప్లెక్స్ లలో టికెట్ ధర రూ.100 పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలి.

నైజాం అంతటా ఉదయం నాలుగు గంటల నుండి ప్రారంభమయ్యే షోలతో కలిపి మొదటి రోజు ఆరు షోలకు అనుమతి ఇవ్వాలి. అలాగే సెలెక్టెడ్ స్క్రీన్స్ లో స్పెషల్ షోస్ అంటే ఫస్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఒంటిగంటకే షో వేసుకునేందుకు అనుమతి ఇవ్వాలి.. అని కోరుతున్నారు. కాగా మైత్రి మూవీ మేకర్స్ అభ్యర్థనలకు ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సలార్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయి.

బాహుబలి తరువాత సరైన సక్సెస్ చూడని ప్రభాస్ కు ఈ సినిమా తప్పకుండా క్లీన్ హిట్ ఇస్తుందేమో అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ సినిమా ప్రమోషన్స్ విషయంలో మాత్రం ఎందుకో చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా లేదనే కామెంట్స్ అయితే వస్తున్నాయి. సెకండ్ ట్రైలర్ లేదని, ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూలు కూడా ఉండవని రూమర్స్ వస్తున్నాయి. మరి ఈ గాసిప్స్ పై చిత్ర యూనిట్ ఏమైనా క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి.

హోంబలే ఫిలిమ్స్ పతాకంపై అత్యంత సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. పృద్వీరాజ్ సుకుమారన్, శ్రేయ రెడ్డి, జగపతి బాబు, ఈశ్వరి రావు తదితరులు నటించారు కీలక పాత్రల్లో నటించారు. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి భువన గౌడ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. రెండు భాగాలుగా రాబోతున్న సలార్ పార్ట్- 1 సీజ్ ఫైర్ పేరుతో రిలీజ్ కానుంది.