Begin typing your search above and press return to search.

సలార్… ఆ ఒక్క గంట నెక్స్ట్ లెవల్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ సలార్

By:  Tupaki Desk   |   15 Aug 2023 4:51 AM GMT
సలార్… ఆ ఒక్క గంట నెక్స్ట్ లెవల్
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ సలార్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిద్ధమవుతోన్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. అందులో సలార్ పార్ట్ 1 సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంపై డార్లింగ్ ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నారు. బాహుబలి2 తర్వాత ఆ స్థాయి హిట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

అది సలార్ తో వస్తుందని చాలా నమ్మకంగా ఉన్నారు. డానికి తగ్గట్లుగానే ప్రశాంత్ నీల్ కూడా చాలా ఎఫర్ట్ పెట్టి ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ పవర్ ఫుల్ విలన్స్ గా కనిపించబోతున్నారు. సినిమాలో రెండు సాంగ్స్ ఉంటాయనే విషయం ఇప్పటికే క్లారిటీ వచ్చింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు సలార్ గురించి మరో ఇంటరెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. చిత్రంలో సెకండ్ ఆఫ్ ఒక గంట ఎపిసోడ్ నెక్స్ట్ లెవల్ లో పీక్స్ లో ఉంటుందంట. ఈ ఎపిసోడ్ మొత్తం సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట. క్లైమాక్స్ అయితే ర్యాంపేజ్ లా గూస్ బాంబ్స్ క్రియేట్ చేయడం ఖాయం అంట. కేజీఎఫ్ చాప్టర్ 2కి మించిపోయే విధంగా సలార్ సెకండ్ హాఫ్ ఉంటుందని చర్చ నడుస్తోంది.

కచ్చితంగా ప్రభాస్ ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా వెయ్యి కోట్ల కలెక్షన్స్ రికార్డ్ ని కూడా అందుకుంటాడని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట. సలార్ నుంచి ఈ రోజు ఇంటరెస్టింగ్ అప్డేట్ ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే టీజర్ లో పెద్ద ఎలివేషన్ లేకుండానే ఇండియన్ వైడ్ గా అందరికి రీచ్ అయిపొయింది.

నెక్స్ట్ థీమ్ సాంగ్ తో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా బిజినెస్ కూడా అన్ని భాషలలో కంప్లీట్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఓవరాల్ గా 500 కోట్ల వరకు వ్యాపారం జరిగి ఉంటుందని ప్రచారం జరుగుతోంది.