Begin typing your search above and press return to search.

సలార్ షూటింగ్ మళ్లీ మొదలా?

వివరాళ్లోకి వెళితే.. సలార్​ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్​ డిలే అవ్వడం వల్ల పోస్ట్​పోన్ అయినట్లు మేకర్స్​ అన్నారు.

By:  Tupaki Desk   |   25 Sep 2023 7:28 AM GMT
సలార్ షూటింగ్ మళ్లీ మొదలా?
X

అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో మూడు రోజుల్లో థియేటర్లన్నీ దద్దరిల్లాల్సింది. ప్రభాస్ సలార్​తో బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సింది. కానీ పరిస్థితులు తారుమరైపోయాయి. సినిమా వాయిదా పడి.. ఎప్పుడు వస్తుందో కూడా సరైనా క్లారిటీ లేదు. అయితే ఈ చిత్రం మళ్లీ షూటింగ్ స్టార్ట్​ చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. అదేంటి షూటింగ్ అయిపోయింది అన్నారు కదా.. మళ్లీ చిత్రీకరణ ఏంటి అని అనుకుంటున్నారా?

వివరాళ్లోకి వెళితే.. సలార్​ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్​ డిలే అవ్వడం వల్ల పోస్ట్​పోన్ అయినట్లు మేకర్స్​ అన్నారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉందట. అందుకే ఈ చిత్రం ఎనిమిది రోజుల షెడ్యూల్​ను ప్రారంభించుకున్నట్లు తెలిసింది. హైదారాబాద్​లో జరుగుతోందట. ప్రభాస్​ పార్ట్​ లేకుండా దీన్ని చిత్రీకరిస్తున్నారట.

ఇక ఇది తెలుసుకుంటున్నా అభిమానులు ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాలేదా అని నిరుత్సాహ పడుతున్నారు. కానీ ఇది ప్యాచ్​ వర్క్ లాంటిది. ఏ సినిమాకైనా మంచి ఔట్​ పుట్​ కోసం ఇలాంటి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. మూవీటీమ్​ కూడా ప్రేక్షకుల అంచనాలను మించేలా.. మరింత మంచి క్వాలిటీ ఔట్ పుట్​ కోసమే ఈ ప్యాచ్ వర్క్​ చేస్తోందని తెలుస్తోంది.

కాగా, ఈ సినిమా ఈ ఏడాది వచ్చే అవకాశం లేదని చిత్ర సీమ నుంచి ఇన్​సైడ్ టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాదిలో రిలీజ్ అవుతుందని పలు రకాల వార్తలు వస్తున్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్​.. ఇండియా వైడ్​గా ఏ సినిమాలు లేని సమయంలో సోలో రిలీజ్​ కోసం ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. చూడాలి మరి ఎప్పుడు వస్తుందో..

ఇకపోతే ఇప్పటికే రిలీజైన టీజర్‌ విశేషంగా ఆకట్టుకుని సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది. హీరోని ఎలివేట్‌ చేస్తూ 'సింపుల్‌ ఇంగ్లిష్‌' డైలాగ్స్‌, యాక్షన్‌ విజువల్స్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన శ్రుతి హాసన్‌ నటిస్తోంది. జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు.