Begin typing your search above and press return to search.

సలార్ అతి నిడివి.. కట్ చేస్తున్న నీల్!?

KGF తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న హై వోల్డేజ్ యాక్షన్ మూవీపై అంచనాలు రోజురోజుకు అమాంతంగా పెరుగుతున్నాయి

By:  Tupaki Desk   |   16 Aug 2023 12:41 PM GMT
సలార్ అతి నిడివి.. కట్ చేస్తున్న నీల్!?
X

KGF తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న హై వోల్డేజ్ యాక్షన్ మూవీపై అంచనాలు రోజురోజుకు అమాంతంగా పెరుగుతున్నాయి. తప్పకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పాత రికార్డులన్నిటిని కూడా బ్రేక్ చేస్తుంది అనే ఫ్యాన్స్ కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు. అయితే ఈ సినిమా అప్డేట్స్ విషయంలో మాత్రం చిత్ర యూనిట్ మళ్ళీ చాలా ఆలస్యం చేస్తుంది అనేలా ఫ్యాన్స్ నుంచి అసంతృప్తి అయితే వస్తోంది.

ఇప్పటికే సాంగ్ కూడా విడుదల చేయాల్సింది. ఆగస్టు 15న పర్ఫెక్ట్ టైమింగ్ లో సాంగ్ విడుదల చేసి ఉంటే సినిమాకు మరింత హెల్ప్ అయ్యేది. కానీ చిత్ర యూనిట్ అలా ఎందుకు చేయలేదు అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. సినిమా ఫస్ట్ లుక్ టీజర్ అయితే హై రేంజ్ లోనే పాజిటివ్ హైప్ క్రియేట్ చేసింది. ఇక నెక్స్ట్ రాబోయే మొదటి సాంగ్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ అప్డేట్స్ విషయం కంటే కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోనే చాలా బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తయింది, కానీ కాస్త ఎడిటింగ్ వర్క్ మాత్రం బ్యాలెన్స్ పడినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా పూర్తి నిడివి సెట్ చేయడానికి వాత రెండు మూడు నెలల నుంచి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారట.

రెండు భాగాలుగా రాబోతున్న సలార్ మొదటి పార్ట్ మాత్రం మూడు గంటలకు పైగా నిడివితో వచ్చిందట. కానీ ఈ సినిమా అసలు రన్ టైమ్ 2 గంటల 50 నిమిషాలకు ఎక్కువ కాకుండా ఫిక్స్ చేయాలని దర్శకుడు అనుకుంటున్నాడు. కానీ అనుకున్న టైం కంటే ఈ సినిమా 15 నిమిషాల ఎక్కువ ఫుటేజ్ వస్తోంది. ఎంత ఎడిట్ చేసినా కూడా ఆ 15 నిమిషాలు తగ్గించడానికి వీలుపడడం లేదట.

ప్రస్తుతం దర్శకుడు అదే విషయం గురించి ఆలోచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు గంటలకు పైగా నిడివి ఉంచకుండా రెండు గంటల 50 నిమిషాలకు ఫిక్స్ చేయాలి అని అనుకుంటున్నారు. మరి ఈ విషయంలో దర్శకుడు ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో చూడాలి. సలార్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 28 విడుదల చేయనున్నారు.