Begin typing your search above and press return to search.

సలార్.. ఆ డేట్ మిస్సయితే..

అదే సమయంలో ఇప్పటికే ఈ చిత్ర కొత్త రిలీజ్​ డేట్​ గురించి పలు ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   13 Sep 2023 12:39 PM GMT
సలార్.. ఆ డేట్ మిస్సయితే..
X

కొద్ది రోజుల క్రితం నుంచి ఇండస్ట్రీలో ఒకటే చర్చ. అదే ప్ర‌భాస్ భారీ యాక్షన్ ఎంటర్​టైనర్​ 'సలార్' మూవీ రిలీజ్ డేట్​ గురించే. ఈ చిత్రం వాయిదా దాదాపుగా కన్ఫామ్​ అయిపోయినా.. మేకర్స్​ ఈ విషయాన్ని అఫీషియల్​గా చెప్పడానికి చాలా సమయమే తీసుకున్నారు. ఎట్టకేలకు తాజాగా ఈ వాయిదా గురించి క్లారిటీ ఇచ్చేశారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్​ను చెబుతామని చెప్పారు.

అయితే ఎప్పుడైతే పోస్ట్ పోన్ ప్రచారం మొదలైందో అప్పటి నుంచి ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ గురించి అందరిలో నిరాశ, ఆసక్తి, టెన్షన్.. మొదలయ్యాయి. అభిమానులేమో సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూద్దామా, ప్రభాస్​ భారీ సక్సెస్​ను అందుకుంటే కాలర్ ఎగరేసుకు తిరుగుదామా అని ఎదురుచూస్తుంటే.. మేకర్స్ మాత్రం.. ఎక్కడ కొత్త రిలీజ్ డేట్ బాంబా వచ్చి తమ మీద పడుతుందో అని ఆందోళ చెందుతున్నారు.

అదే సమయంలో ఇప్పటికే ఈ చిత్ర కొత్త రిలీజ్​ డేట్​ గురించి పలు ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని నవంబర్ లేదా డిసెంబర్ క్రిస్మస్​కు ప్రేక్షకుల ముందుకు తీసుకురావొచ్చని కథనాలు వస్తున్నాయి. మూవీటీమ్​ కూడా సాధ్యమైనంత వరకు ఈ చిత్రాన్ని మంచి ఔట్​ఫుట్​తో అంచనాలకు తగ్గటుగా ఈ ఏడాదే తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తోంది. లేదంటే ఇక తప్పని పరిస్థితుల్లో ఇక వచ్చే ఏడాదికే విడుదల చేయాలని అనుకుంటుందట.

ఏదిఏమైనా దాదాపుగా ఈ ఏడాది నవంబర్​ లేదా డిసెంబర్​లో రిలీజ్​ పక్కా అన్న ఊపు మాత్రం ఎక్కువ ఉంది. అభిమానులు కూడా అప్పుడే రావాలని కోరుకుంటున్నారు. కానీ ఈ రెండు నెలల్లో రావడం మిస్ అయిందా.. ఇక ఈ చిత్రం 2024 మార్చులోనే అన్న టాక్ వినిపిస్తోంది.

ఎందుకంటే జనవరిలో సంక్రాంతి సీజన్​ ఇప్పటికే ఫుల్ అయిపోయింది. గుంటూరు కారం, ఈగల్, నా సామి రంగ, హనుమాన్ ఇలా చాలానే వస్తున్నాయి. ఒకవేళ సలార్ దిగిన ఈ సినిమాలే తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఫిబ్రవరి చెప్పుకోదగ్గ సీజన్ కాదు. అందుకే ఈ నెలలోనూ వచ్చే అవకాశం ఉందడు. కాబట్టి ఇక ఈ చిత్రాన్ని మార్చికే తీసుకొచ్చే అవకాశం ఉంటుందన్న మాటలు వినిపిస్తున్నాయి.