Begin typing your search above and press return to search.

సలార్ రిలీజ్.. చివర్లో ఈ ట్విస్టెంటీ సామీ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే సలార్ సినిమాపై ఎన్ని ఆశలు పెట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు

By:  Tupaki Desk   |   1 Sep 2023 9:43 AM GMT
సలార్ రిలీజ్.. చివర్లో ఈ ట్విస్టెంటీ సామీ?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే సలార్ సినిమాపై ఎన్ని ఆశలు పెట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలు ఒకదాని తరువాత మరొకటి సాహో రాధే శ్యామ్ ఆదిపురుష్ మూడు కూడా ఒకదానికి మించి మరొకటి ప్లాప్ ను మూటగట్టుకున్నాయి. ఈ తరహా ఫెయిల్యూర్ ను ప్రభాస్ ఎప్పుడు కూడా చూడలేదు.

అయినప్పటికీ ప్రభాస్ మార్కెట్ రేంజ్ కూడా అసలు తగ్గలేదు. ఎందుకంటే అతని లైనప్లో ఉన్న సినిమాలు అలాంటివి. నెవర్ బిఫోర్ అనే కాంబినేషన్స్ తో రాబోతున్న ప్రభాస్ తప్పకుండా త్వరలోనే సక్సెస్ అందుకుంటాడు అనే ఫ్యాన్స్ అయితే చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరపైకి వస్తున్న సలార్ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు పెరిగిపోయాయి.

ఇక ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారా అనీ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి సెప్టెంబర్ 28 డేట్ ఫిక్స్ అని కూడా గత ఏడాది చెప్పడంతో ఆ క్షణం కోసం అభిమానులు చాలా ఓపికతో ఉన్నారు. మొత్తానికి సెప్టెంబర్ నెలలోకి అడుగుపెట్టడంతో సలార్ హడావిడి మొదలవుతుంది అని కూడా అందరూ అనుకున్నారు.

అయితే ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు మరికొన్ని ఊహించని గాసిప్స్ అయితే ఫ్యాన్స్ ను కన్ఫ్యూజన్ కు గురి చేస్తున్నాయి. ఈ సినిమాను మళ్ళీ వాయిదా వేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. లాస్ట్ ఎడిటింగ్ వర్కకొసం ఇంకాస్త టైమ్ కావాలి అని దర్శకుడు నిర్మాతలతో మాట్లాడుతున్నట్లు సమాచారం.

ఇక హోంబెల్ ఫిలిమ్స్ కూడా బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ఆలోచిస్తూ మరో రెండు మూడు నెలలు సినిమాను వాయిదా వేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే డిస్టిబూటర్స్ కు కూడా ఈ విషయంలో ఒక హింట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక లేటెస్ట్ టాక్ ప్రకారం సినిమా దసరాకి గాని లేదంటే డిసెంబర్లో గాని వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ గాసిప్స్ పై ఇప్పటికే ఫ్యాన్స్ అయితే చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చివరలో ఇలా ట్విస్ట్ ఇవ్వడం ఏమాత్రం న్యాయం కాదు అని ఇదేదో ముందే చెబితే బాగుండేది అనే విధంగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో సలార్ నిర్మాతలు ఏ విధంగా క్లారిటీ ఇస్తారో చూడాలి.