Begin typing your search above and press return to search.

సలార్ డామినేషన్.. డుంకి వాయిదా తప్పదా?

అయితే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ దెబ్బతో షారుక్ ఖాన్ సినిమాకు పెద్ద తలనొప్పులు మొదలయ్యాయి.

By:  Tupaki Desk   |   2 Oct 2023 4:37 PM GMT
సలార్ డామినేషన్.. డుంకి వాయిదా తప్పదా?
X

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వీలైనంతవరకు బాక్సాఫీస్ వద్ద పోటీ లేకుండా అగ్ర హీరోలు సినిమాలను విడుదల చేసుకుంటూ ఉంటారు. ఇక ఒకప్పుడు బాలీవుడ్ నుంచి బిగ్గెస్ట్ కాంబినేషన్ మూవీ వస్తుంది అంటే ఇతర భాషల్లో వచ్చే లోకల్ సినిమలు కూడా కొన్నిసార్లు వాయిదా పడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ దెబ్బతో షారుక్ ఖాన్ సినిమాకు పెద్ద తలనొప్పులు మొదలయ్యాయి.

డుంకి సినిమా ఇప్పుడు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు కొత్త పుకార్లు మొదలయ్యాయి. సలార్ సినిమాతో పోటీ పడడం ఎంతవరకు కరెక్ట్ అనే విషయంలో రాజ్ కుమార్ హీరాని టీం గట్టిగానే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రొడక్షన్లో షారుక్ ఖాన్ కూడా ఒక భాగంగా ఉన్నాడు. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ కూడా తన ఎప్పటిలానే ఈ సినిమాలో కూడా ఒక భాగస్వామిగానే ఉన్నాడు.

దీంతో డుంకి సినిమా బిజినెస్ ఇప్పుడు నిర్మాతలకే కాకుండా దర్శకుడికి హీరోకు కూడా చాలా కీలకంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాకు ఎక్కువ స్థాయిలో థియేటర్స్ లభించేలా చూసుకోవాలని కూడా అనుకుంటున్నారు. కానీ హఠాత్తుగా సలార్ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ కి షిఫ్ట్ కావడంతో ఇప్పుడు ఆ విషయంలోనే అసలు సమస్యలు మొదలయ్యాయి.

ప్రభాస్ సలార్ సినిమా దాదాపు 60 శాతానికి పైగా స్క్రీన్స్ పొందే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు డుంకి సినిమాకు ఈ పోటీలో కేవలం 40 శాతం స్క్రీన్స్ మాత్రమే వచ్చే అవకాశం ఉందట. డిస్ట్రిబ్యూటర్స్ బిజినెస్ ప్రకారమే ఈ సినిమా స్క్రీన్స్ డివైడ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు షారుఖ్ ఖాన్ మళ్లీ డిస్ట్రిబ్యూటర్స్ తో బాగానే చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాకు తక్కువ స్క్రీన్స్ రాకూడదు అని అనుకుంటున్నారు.

ఇక లెక్క తెలని పక్షంలో డుంకి ని వాయిదా వేసుకోవడం తప్ప మరో ఆలోచన లేదు. ఆ దిశగా ఏమైనా ఆలోచిస్తారా లేదా అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రాజ్ కుమార్ హీరాని సినిమా అంటేనే ఒక రేంజ్ లో బజ్ ఉంటుంది. దానికి తోడు ఫస్ట్ టైమ్ షారుక్ ఖాన్ తో. అందులోనూ షారుఖ్ వరుసగా రెండు ఇండస్ట్రీ హిట్స్ కొట్టేసి వస్తున్నాడు.

ఈ కాంబినేషన్కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ థియేటర్లో వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా డిమాండ్ ఎక్కువగా ఉన్న సలార్ మాత్రం డామినేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. KGF సినిమాలతో బాలీవుడ్ లోకల్ రికార్డులను కూడా బ్లాస్ట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ బాహుబలి లాంటి ప్రభాస్ తో ఇంకెంత దారుణంగా డామినేట్ చేస్తాడో అనే భయం షారుఖ్ టీమ్ లో అయితే ఉంది. కాబట్టి రిస్క్ చేయకుండా మరొక డేట్ సెట్ చేసుకునే దిశగా డుంకి ఆలోచిస్తున్నట్లు ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.