Begin typing your search above and press return to search.

'స‌లార్' కేర‌ళ హ‌క్కులు 'విల‌న్' చేతికి?

మోస్ట్ అవైటెడ్ 2023 పాన్ ఇండియా మూవీగా స‌లార్ సంచ‌ల‌నాల‌కు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   6 Nov 2023 1:30 PM GMT
స‌లార్ కేర‌ళ హ‌క్కులు విల‌న్ చేతికి?
X

మోస్ట్ అవైటెడ్ 2023 పాన్ ఇండియా మూవీగా స‌లార్ సంచ‌ల‌నాల‌కు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. క్రిస్మ‌స్ రేస్ లో షారూఖ్ డంకీని ఢీకొడుతూ క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించేందుకు థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. బాహుబ‌లి ఫ్రాంఛైజీ త‌ర్వాత మ‌ళ్లీ ప్ర‌భాస్ కి గ్రేట్ కంబ్యాక్ ఇచ్చే చిత్ర‌మిద‌ని చ‌ర్చ సాగుతోంది. కేజీఎఫ్-కేజీఎఫ్ 2 చిత్రాల‌తో సంచ‌ల‌నం సృష్టించిన గ్రేట్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్.. ఈసారి ప్ర‌భాస్ ని మ్యాసివ్ యాక్ష‌న్ స్టార్ గా ఆవిష్క‌రిస్తుండ‌డంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ముఖ్యంగా స‌లార్ కాస్టింగ్ ఎంతో ఎగ్జ‌యిట్ చేస్తోంది. శృతిహాస‌న్, పృథ్వీరాజ్ సుకుమార‌న్ స‌హా ప‌లువురు మేటి స్టార్లు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. హాలీవుడ్ సాంకేతిక నిపుణుల‌తో వీఎఫ్ ఎక్స్ స‌హా ప్ర‌తిదీ హైలైట్ గా తీర్చిదిద్దుతున్నార‌న్న టాక్ వినిపిస్తోంది.


యాక్షన్-ప్యాక్డ్ 'స‌లార్' రిలీజ్ కి ఇంకో నెల‌రోజుల స‌మ‌యం మాత్ర‌మే మిగిలి ఉంది. అదే క్ర‌మంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్షకులలో ఉత్సుకతను రేకెత్తిస్తోంది. 22 డిసెంబర్ 2023 న విడుదల చేయడానికి నిర్మాత‌లు దేశ‌వ్యాప్తంగా భారీగా ప్రైమ్ థియేట‌ర్ల‌ను లాక్ చేస్తున్నార‌న్న స‌మాచారం ఉంది. ఈ చిత్రాన్ని హిందీ బెల్ట్ లో త‌డానీలు రిలీజ్ చేస్తుండ‌డంతో థియేట‌ర్ల ప‌రంగా ఎలాంటి స‌మ‌స్యా ఉండ‌ద‌ని, క‌లెక్ష‌న్ల ప‌రంగా డోఖా ఉండ‌ద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఇంత‌లోనే ఇప్పుడు స‌లార్ చిత్రాన్ని కేర‌ళ‌లో పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ లో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కేరళలో పంపిణీ చేయనున్నట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అతను రాష్ట్రవ్యాప్తంగా భారీ నెట్‌వర్కింగ్‌తో కేరళకు చెందిన ప్రముఖ నిర్మాత, పంపిణీదారు కావ‌డంతో స‌లార్ కి కేర‌ళ‌లోను బోలెడంత హైప్ నెల‌కొంటుంద‌ని భావిస్తున్నారు. తాజా ప్రకటనలో చిత్ర బృందం మరోసారి సినిమా విడుదల తేదీని ధృవీకరించింది. క్రిస్మ‌స్ రేస్ లో త‌గ్గేదేలేద‌ని హోంబ‌లే బృందం ఖ‌రారు చేసింది. 'సలార్: పార్ట్ 1' ప్రశాంత్ నీల్ - ప్రభాస్ మధ్య మొదటి ప్ర‌య‌త్నం. దీనిని హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ చిత్రంలో ప్రభాస్, శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు వంటి భారీ తారాగణం న‌టించారు.

ఇదే చిత్రంలో న‌టించిన ప్ర‌ముఖ హీరో పృథ్వీరాజ్ ఏకంగా కేర‌ళ రాష్ట్ర రిలీజ్ హ‌క్కుల‌ను ద‌క్కించుకున్నారు అంటే స‌లార్ పై అత‌డి న‌మ్మ‌కం ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌శాంత్ నీల్ టేకింగ్, ప్ర‌భాస్ ఇమేజ్ దృష్ట్యా అత‌డు కేర‌ళ‌లో మ్యాసివ్ గా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు భావిస్తున్నారు. పృథ్వీరాజ్ ఈ చిత్రంలో భీక‌ర‌మైన విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్ తో నువ్వా నేనా? అంటూ ఢీకొట్టే పాత్ర‌తో మైమ‌రిపించ‌బోతున్నాడు.