Begin typing your search above and press return to search.

సలార్‌... ఇలా వెయ్యి కోట్లు సాధ్యమా?

కేజీఎఫ్‌ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందిన 'సలార్‌' సినిమా భారీ ఎత్తున విడుదలకు సిద్ధం అవుతోంది

By:  Tupaki Desk   |   14 Aug 2023 8:41 AM GMT
సలార్‌... ఇలా వెయ్యి కోట్లు సాధ్యమా?
X

యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్, కేజీఎఫ్‌ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందిన 'సలార్‌' సినిమా భారీ ఎత్తున విడుదలకు సిద్ధం అవుతోంది. సెప్టెంబర్‌ 28న విడుదల కాబోతున్న సలార్‌ ఛాప్టర్ 1 పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే కేజీఎఫ్‌ 2 సినిమా రేంజ్ లో బజ్‌ క్రియేట్‌ అయిందా అంటే లేదు అనే సమాధానం వస్తుంది. ప్రభాస్ గత చిత్రాల ప్రభావం మరియు ఇతర కారణాల వల్ల సలార్‌ కి హైప్ ఎక్కువగా కనిపించడం లేదు.

ప్రశాంత్ నీల్ గత చిత్రం కేజీఎఫ్ 2 వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసిన విషయం తెల్సిందే. కేజీఎఫ్ 2 కి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అంటూ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ చాలా నమ్మకంగా చెబుతున్నాడు. ఇప్పటికే విడుదల అయిన విజువల్స్ మరియు ఫోటోలు కేజీఎఫ్ కి ఏమాత్రం తగ్గకుండా సలార్ ఉంటుందనే నమ్మకంను కలిగిస్తుంది.

సినిమాకు భారీ వసూళ్లు నమోదు అవ్వాలి అంటే కచ్చితంగా ఓపెనింగ్స్ భారీగా ఉండాలి. భారీ ఓపెనింగ్స్ ఉండాలి అంటే సినిమాకు భారీ బజ్‌ క్రియేట్‌ అవ్వాల్సిన అవసరం ఉంది. సలార్ వెయ్యి కోట్లు సాధించాలి అంటే కచ్చితంగా సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీగా పబ్లిసిటీ దక్కాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ప్రభాస్‌ సలార్‌ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రస్తుతానికి మంచి అంచనాలను కలిగి ఉంది. భారీ వసూళ్లు సాధించాలి అంటే ఇంకాస్త ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి సినిమా ప్రమోషన్ హడావుడి ఏమీ లేదు. సినిమా ట్రైలర్‌ విడుదల అయ్యే వరకు యూనిట్‌ సభ్యులు మీడియాతో మాట్లాడకూడదు అంటూ కండీషన్ పెట్టారట.

మొత్తానికి సలార్ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు మొదలు పెట్టక పోవడం పై ప్రభాస్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే వెయ్యి కోట్ల వసూళ్లు ఎలా నమోదు అవుతాయి అంటూ వారు ప్రశ్నిస్తూ సోషల్‌ మీడియా ద్వారా ప్రశాంత్ నీల్ ను ప్రశ్నిస్తున్నారు.