Begin typing your search above and press return to search.

విజయ్ రికార్డ్ బ్రేక్ చేయలేకపోయిన ప్రభాస్!

ఈ ఇయర్ సౌత్ నుంచి ఓపెనింగ్ డే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే 100 కోట్లు కలెక్ట్ చేసిన ఏకైక చిత్రం 'లియో'

By:  Tupaki Desk   |   22 Dec 2023 4:48 PM GMT
విజయ్ రికార్డ్ బ్రేక్ చేయలేకపోయిన ప్రభాస్!
X

ఈ ఇయర్ సౌత్ నుంచి ఓపెనింగ్ డే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే 100 కోట్లు కలెక్ట్ చేసిన ఏకైక చిత్రం 'లియో'. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలపతి విజయ్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది. రీసెంట్ గానే ఓటీటీలోనూ భారీ రెస్పాన్స్ అందుకుంది. లియో మూవీ రిలీజ్ కు ముందే 100 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ ని రాబట్టింది.

దాంతో కోలీవుడ్లో గతంలో ఉన్న 50 కోట్ల ఓపెనింగ్ డే రికార్డును బ్రేక్ చేసి విడుదలైన మొదటి రోజు 145 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తొలి రోజు షోలు ప్రారంభం కాకముందే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లో 100 కోట్లు రాబట్టింది. ఇక ఇదే రికార్డును ప్రభాస్ 'సలార్' మూవీ బ్రేక్ చేస్తుందని అంతా భావించారు. కానీ అది జరగలేదు. సలార్ కి ఇతర భాషల నుంచి అనుకున్నంత అడ్వాన్స్ బుకింగ్స్ రాలేదు.

తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ సినిమాకి భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. లియోతో పోల్చుకుంటే సలార్ కి హిందీ వెర్షన్ బుకింగ్స్ సమానంగా ఉన్నా దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో లియో మూవీకి సలార్ కంటే భారీ స్థాయిలో బుకింగ్స్ జరిగాయి. దాంతో సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ 85 కోట్ల దగ్గరే ఆగిపోయింది. ఫలితంగా 2023లో ఓపెనింగ్ డే 100 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ ను అందుకున్న చిత్రంగా 'లియో' అరుదైన ఘనతను సాధించింది.

ఈ ఇయర్ ఇండియన్ మూవీస్ లో ఈ ఘనతను సాధించిన ఏకైక సినిమా కూడా ఇదే కావడం విశేషం. నిజానికి మొదట అడ్వాన్స్ బుకింగ్స్ లో సలార్ జోరు చూసి కచ్చితంగా ఇది లియో రికార్డింగ్ బ్రేక్ చేస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఇతర దక్షిణాది భాషల్లో అనుకున్నంత స్థాయిలో బుకింగ్స్ జరగకపోవడం వల్లే సలార్ లియో రికార్డుని కాస్తలో మిస్ అయ్యాడు.

ఇక నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన సలార్ మూవీకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాని హోం బలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ సుమారు 250 కోట్ల బడ్జెట్ తో నిర్మించింది. శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో పృధ్విరాజ్ సుకుమారన్, జగపతిబాబు, బాబీ సింహ, ఈశ్వరి రావ్, శ్రియ రెడ్డి, టీనూ ఆనంద్, సప్తగిరి, బ్రహ్మాజీ, కమెడియన్ పృథ్వి తదితరులు ఇతర పాత్రలు పోషించారు.