Begin typing your search above and press return to search.

సలార్ మూవీ.. ఒకే ఒక్క వీడియాతో చెప్పేశాడుగా!

పాన్ ఇండియా హీరో ప్రభాస్, కన్నడ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్లో తెరకెక్కిన సలార్ ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది

By:  Tupaki Desk   |   26 Dec 2023 7:46 AM GMT
సలార్ మూవీ.. ఒకే ఒక్క వీడియాతో చెప్పేశాడుగా!
X

పాన్ ఇండియా హీరో ప్రభాస్, కన్నడ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్లో తెరకెక్కిన సలార్ ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది. రిలీజ్ అయిన మొదటి రోజే రూ.178 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసి 2023లో హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న మూవీగా నిలిచింది. ఇప్పుడు నాలుగు రోజులు కలిపి రూ.500 కోట్లకుపైగా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఈ చిత్రానికి సంబంధించి అనేక మంది సోషల్ మీడియాలో తమ స్టైల్ లో రివ్యూలు ఇచ్చారు. తాజాగా కర్ణాటకకు చెందిన ఓ మూవీ ఎనలిస్ట్.. సలార్ మూవీను స్పెషల్ వీడియో ద్వారా వివరించాడు. అందులో ఖన్సార్ లో మూడు తెగల కుటుంబ వంశ వృక్షాన్ని వీడియో ద్వారా ఎక్ ప్లైన్ చేశాడు. "మొదటి సారి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నా. ఇవన్నీ ఒకచోట చేర్చడానికి నాకు కొంత సమయం పట్టింది. ముందుగా ఖాన్సార్ తెగల కుటుంబ వృక్షంతో స్టార్ట్ చేద్దాం" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది.

వీడియో ప్రకారం.. ఖాన్సార్ అనే సామ్రాజ్యంలో మన్నార్సి, శౌర్యాంగ, ఘన్నార్ అనే మూడు తెగలు ఉన్నాయి. ఆ మూడు తెగలు ఒక్కటై ఖాన్సార్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. నిబంధనలతో పేరుతో ఓ పుస్తకాన్ని తయారు చేసుకుంటారు. దాని ప్రకారం ఒక్కొక్కరు 40 ఏళ్లు పాలించి పక్క తెగకు సామ్రాజ్య బాధ్యతలు అప్పగించాలి.

ఫస్ట్ శివమన్నార్ పరిపాలించాక అతడు చనిపోతాడు. ఆ తర్వాత శౌర్యాంగ తెగకు చెందిన ధారకు బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. కానీ రాజ మ‌న్నార్ (జ‌గ‌ప‌తిబాబు).. శౌర్యాంగ తెగకు చెందిన వారందరినీ అంతం చేసి సామ్రాజ్యానికి కర్తగా మారుతాడు. జగపతిబాబుకు ఇద్దరు భార్యలు. రాధారమ, రాజమన్నార్ మొదటి భార్యలు పిల్లలు కాగా.. వరదరాజ మన్నార్, బాచి రాజమన్నార్ రెండో భార్య పిల్లలు. మన్నార్సి, ఘనియార్ తెగలకు చెందిన వారు ఖాన్సార్ సామ్రాజ్యంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరూ అలా ఎనిమిది మంది దొర‌గా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. అందులో 8 మంది దొరలు.. మన్నార్సి తెగకు చెందిన వారు.

అదే సమయంలో తానుండ‌గా తన రెండో భార్య కొడుకు వ‌ర‌ద రాజమ‌న్నార్ (పృథ్వీరాజ్ సుకుమార‌న్‌)ను దొర‌గా చూడాలనేది త‌న కోరిక‌గా చెబుతాడు కర్త రాజ‌మ‌న్నార్. అది రుద్ర, భారవ, రంగాకు నచ్చదు. అదే సమయంలో రాజమన్నార్ సామ్రాజాన్ని వదిలి విదేశాలకు వెళతాడు. తిరిగొచ్చేలోపు ఖాన్సార్ క‌థ మొత్తం మారిపోతుంది. కుర్చీ కుతంత్రాలు ప‌తాక స్థాయికి చేరుకుని వ‌ర‌ద రాజ‌మ‌న్నార్‌ను అంతం చేయ‌డం వ‌ర‌కు వెళ్తోంది. అందుకోసం మిగ‌తా దొర‌లంతా త‌మ సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకుంటారు.

ఆ సమయంలో రాజమన్నార్ కుమార్తె రాధారమ కాల్పుల విరమణను ప్రకటిస్తుంది. అప్పుడు నిబంధన పుస్తక ప్రకారం రుద్ర.. రాధారమ ఆదేశాలను ఛాలెంజ్ చేశారు. కాల్పుల విరమణపై ఓటింగ్ కు పిలుపునిస్తారు. అక్కడి నుంచి తొమ్మిది రోజుల తర్వాత ఓటింగ్ జరగనుంది. ఆ 9రోజులు ఏం జరిగింది, తొమ్మిదో రోజు ముందు రాత్రి ఏం జరిగందనేది మిగతా కథ. అయితే ఈ ఎనిలిస్ట్ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు అభిమానులు. బాగా వివరించారంటూ ప్రశంసిస్తున్నారు.

హోంబల్ ఫిల్స్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు జగపతి బాబు, శ్రియా రెడ్డి, బాబీ సింహా, టిన్నూ ఆనంద్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సీక్వెల్ ను శౌర్యాంగ పర్వంగా ప్రశాంత్ నీల్ ప్రకటించారు. 2025లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.