Begin typing your search above and press return to search.

'సలార్‌' లో వదిన పాత్రపై ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

సలార్‌ సినిమాలో తమిళ్‌ హీరో విశాల్ కి వదిన అయిన శ్రియా రెడ్డి కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా చాలా రోజుల క్రితమే అధికారికంగా కన్ఫర్మేషన్ వచ్చింది

By:  Tupaki Desk   |   8 Dec 2023 8:05 AM GMT
సలార్‌ లో వదిన పాత్రపై ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌
X

ప్రభాస్ హీరోగా ప్రశాంత్‌ నీల్ రూపొందించిన పాన్ ఇండియా భారీ బడ్జెట్‌ చిత్రం సలార్‌ క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా పై ఉన్న అంచనాలు ట్రైలర్‌ విడుదల తర్వాత రెట్టింపు అయ్యాయి అనడంలో సందేహం లేదు. ట్రైలర్‌ లో పలు ఆసక్తికర విషయాలను దర్శకుడు చూపించాడు.

సలార్‌ సినిమాలో తమిళ్‌ హీరో విశాల్ కి వదిన అయిన శ్రియా రెడ్డి కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా చాలా రోజుల క్రితమే అధికారికంగా కన్ఫర్మేషన్ వచ్చింది. అయితే ఆమె ఎలా ఉంటుంది... ఏ పాత్రలో కనిపిస్తుంది అనే విషయమై స్పష్టత లేదు. తాజాగా ట్రైలర్ లో ఆమెకు సంబంధించి రెండు షాట్స్‌ ను దర్శకుడు చూపించాడు.

ఆమె కట్టు బొట్టు చూస్తే ఉంటే చాలా పవర్‌ ఫుల్‌ ఉమెన్‌ గా అనిపిస్తోంది. అదే సమయంలో పృథ్వీరాజ్ సుకుమారన్‌ భార్య పాత్రలో ఆమెను చూస్తున్నామేమో అంటూ కొందరు ఊహిస్తున్నారు. మొత్తానికి సినిమాలో ఆమె పాత్ర అత్యంత పవర్‌ ఫుల్‌ గా ఉండటంతో పాటు, మంచి నిడివితో ఉండే అవకాశాలు ఉన్నాయి.

హీరోయిన్‌ గా తెలుగు మరియు తమిళ భాషల్లో నటించి మెప్పించిన శ్రియా కెరీర్‌ ఆరంభంలోనే విశాల్‌ సోదరుడు అయిన విక్రమ్‌ ను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత నటిగా, నిర్మాతగా పలు సినిమాలు చేసింది.

ఈ నెలలో ప్రభాస్ సలార్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శ్రియా రెడ్డి మరో వైపు పవన్‌ ఓజీ చిత్రంలో కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ముందు ముందు లీడ్‌ లేడీ పాత్రలకు శ్రియా రెడ్డి మోస్ట్‌ వాంటెడ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.