Begin typing your search above and press return to search.

సలార్ కోసం మరో కొత్త స్ట్రాటజీ

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ సలార్. ఈ మూవీ ప్యాచ్ వర్క్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ ప్రస్తుతం జరుగుతోంది

By:  Tupaki Desk   |   2 Oct 2023 4:57 AM GMT
సలార్ కోసం మరో కొత్త స్ట్రాటజీ
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ సలార్. ఈ మూవీ ప్యాచ్ వర్క్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ ప్రస్తుతం జరుగుతోంది. ఇప్పటికే మూవీ రిలీజ్ కావాల్సి ఉండేది. అయితే ప్రశాంత్ నీల్ అవుట్ పుట్ విషయంలో సంతృప్తికరంగా లేకపోవడంతో రిలీజ్ వాయిదా వేసేశారు. డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.

భారీ బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ రెండు భాగాలుగా సలార్ నిర్మిస్తోంది. హై వోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ చిత్రంగా దీనిని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాపై డార్లింగ్ ఫ్యాన్స్ చాలా ఎక్స్ పెక్టేషన్స్ తో ఉన్నారు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నుంచి ఇప్పటి వరకు సాలిడ్ బ్లాక్ బస్టర్ మూవీ రాలేదు. సలార్ ఆ కోరిక తీరుస్తుందని ఆశిస్తున్నారు.

దీనికి తగ్గట్లుగానే మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచడానికి దర్శకుడు ప్రశాంత్ నీల్ పెర్ఫెక్ట్ స్ట్రాటజీతో ముందుకి వెళ్తున్నారు. డార్లింగ్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అక్టోబర్ 23న సలార్ ట్రైలర్ రిలీజ్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్ మూవీపై అమాంతం అంచనాలు పెంచేలా డిజైన్ చేస్తున్నారంట.

ఈ ట్రైలర్ తర్వాత రిలీజ్ ముందు సెకండ్ ట్రైలర్ ని కూడా విడిచిపెట్టాలని అనుకుంటున్నారు. ఇలా రెండు ట్రైలర్స్ ని రిలీజ్ చేయడంతో ద్వారా సినిమాని ఆడియన్స్ కి చేరువ చేయడం సులభం అవుతుందనే అంచనా వేస్తున్నారంట. ఇప్పటికే మూవీపై భారీ ఎత్తున బిజినెస్ జరిగింది. దానికి తగ్గట్లుగానే బెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ రావడాలంటే కచ్చితంగా సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉండాలి.

దానికోసమే సలార్ టీమ్, ప్రశాంత్ నీల్ ఇలా రెండు ట్రైలర్స్ సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ స్ట్రాటజీ సలార్ మూవీకి ఎలాంటి బూస్టింగ్ తీస్తుకోస్తుంది అనేది వేచి చూడాలి. సలార్ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా చేస్తోంది. ఈ మూవీ రిలీజ్ అయితే మళ్ళీ నటిగా బిజీ కావడానికి ఛాన్స్ దొరుకుతుందని ఆమె భావిస్తోంది.