Begin typing your search above and press return to search.

సలార్ కొత్త​ డేట్​ వచ్చేసిందోచ్​.. వైలెంట్​గా ప్రభాస్​..

పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్‌ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది

By:  Tupaki Desk   |   29 Sep 2023 6:57 AM GMT
సలార్ కొత్త​ డేట్​ వచ్చేసిందోచ్​.. వైలెంట్​గా ప్రభాస్​..
X

పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్‌ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. కేజీయఫ్ ఫేమ్​ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్​టైనర్​ 'సలార్‌' మూవీ కొత్త విడుదల తేదీని ఎట్టకేలకు చిత్రబృందం​ అనౌన్స్ చేసింది. వైలెంట్​గా ఉన్న ప్రభాస్​ కొత్త పోస్టర్​ను కూడా రిలీజ్ చేసింది.


వివరాళ్లోకి వెళితే.. మొదట ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 28న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. దీంతో ఈ డేట్​కు నెల రోజుల ముందే అభిమానులు సందడి మొదలైపోయింది. నెట్టింట్లో రోజుకో పోస్టర్‌తో కౌంట్‌ డౌను ప్రారంభించేశారు. అయితే సినిమా విడుదల తేదీ దగ్గర పడిన సమయంలో మూవీటీమ్​ పోస్ట్​పోన్​ అంటూ అభిమానులందరికీ సడెన్ షాక్ ఇచ్చింది.

కొన్ని కారణాల వల్ల విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అభిమానులు, దేశవ్యాప్తంగా సినీ ప్రియులంతా నిరాశపడ్డారు. దీంతో మళ్లీ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురుచూడటం ప్రారంభించారు. ఈ క్రమంలోనే తాజాగా మూవీటీమ్​.. డిసెంబర్‌ 22న సలార్​ రానుందని తెలుపుతూ ఓ సరికొత్త ఊరమాస్​ వైలెంట్​ పోస్టర్​ను రిలీజ్​ చేసి అభిమానుల్లో మరోసారి ఉత్సాహాన్ని నింపింది.

ఈ పోస్టర్​రో ప్రభాస్​.. ఒళ్లంతా రక్తంతో భారీ ఖడ్గంతో సీరియస్​ లుక్​లో ఎంతో వైలెంట్​గా కనిపించారు. ఆరడగుల కటౌట్​లో భారీ ఫిజిక్​తో భయపెట్టే రేంజ్​లో ఉన్నారు. బ్యాక్​గ్రౌండ్​లో నల్లటి మబ్బులతో డిజైన్ చేసిన ఈ​ పోస్టర్​లో ప్రభాస్​ను ఇంత వైలెంట్​గా చూస్తుంటే మూవీటీమ్​ ఇంతకుముందు చెప్పినట్టే అచ్చం శత్రువులపై విరుచుకుపడే డైనోసార్​లానే కనిపించారు. ఇంతకముందు ఎప్పుడూ ప్రభాస్​ను ఎవరూ ఇంత వైలెంట్​గా చూపించలేదనే చెప్పాలి. ఇక ఈ రిలీజ్ డేట్​ తెలియడంతో ప్రభాస్‌ అభిమానులంతా తెగ సంబర పడిపోతున్నారు. సోషల్‌ మీడియాలో హ్యాష్‌ ట్యాగ్‌లు ట్రెండింగ్‌ చేస్తున్నారు. ప్రభాస్‌ సలార్‌: సీజ్‌ఫైర్‌ (#SalaarCeaseFire) అంటూ సందడి చేస్తున్నారు. కాగా, ఇప్పటికే విడుదలైన టీజర్‌ విశేషంగా ఆకట్టుకుని సినిమాపై భారీ అంచనాలు పెంచేసి సంగతి తెలిసిందే.

ఇకపోతే ఈ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రంలో ప్రభాస్‌ సరసన శ్రుతి హాసన్‌ హీరోయిన్​గా నటిస్తున్నారు. జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.