Begin typing your search above and press return to search.

సలార్​.. ప్రతి ఒక్కరిదీ ఇదే బాధ​

అటు అభిమానులకు నిరాశను.. ఇటు ఇతర చిన్న-పెద్ద సినిమా మేకర్స్​కు టెన్షన్​ను క్రియేట్​ చేసేసి సైలెంట్​గా ఉన్నారు సలార్​ మేకర్స్.

By:  Tupaki Desk   |   19 Sep 2023 8:05 AM GMT
సలార్​.. ప్రతి ఒక్కరిదీ ఇదే బాధ​
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్​టైనర్​ 'సలార్' మూవీ కొత్త రిలీజ్ డేట్ కన్ఫూజన్, టెన్షన్​ ఇప్పట్లో వదిలేటట్టు కనిపించడం లేదు. 'సింపుల్‌ ఇంగ్లీష్‌..' అంటూ మొదలు పెట్టి ప్రభాస్‌ను డైనోసార్‌గా పోలుస్తూ అంచనాలను అమాంతం పెంచేసి.. ఆ తర్వాత రిలీజ్ సమయానికి 'మీకు మంచి క్వాలిటీ కంటెంట్​ అందిస్తాం.. కాస్త ఆగండి' అంటూ హ్యాండ్ ఇచ్చిందీ చిత్రం.

అటు అభిమానులకు నిరాశను.. ఇటు ఇతర చిన్న-పెద్ద సినిమా మేకర్స్​కు టెన్షన్​ను క్రియేట్​ చేసేసి సైలెంట్​గా ఉన్నారు సలార్​ మేకర్స్. ఈ తతంగమంతా జరిగి రోజులు గడుస్తున్నా ఇంకా కొత్త రిలీజ్ డేట్ రాకపోవడం..ఇతర సినిమా టీమ్స్​ను బాగా ఇబ్బందికి గురి చేస్తోంది. ఎక్కడ ఈ కొత్త రిలీజ్ డేట్ బాంబ్​​ తమ సినిమాలపై ప్రభావం చూపుతుందని ఇప్పటికే ఇండియా వైడ్​గా చాలా బడా చోటా చిత్రాలు తమ విడుదల తేదీని కన్ఫామ్ చేసుకోలేక కిందా మీద పడుతున్నాయి.

కానీ సలార్ మాత్రం ఇంకా డిలే చేస్తూ.. కొత్త విడుదల తేదీపై సందిగ్ధతను కొనసాగిస్తూనే ఉంది. ఈ ఏడాది నవంబర్, వచ్చే ఏడాది జనవరి(సంక్రాంతి), ఆగస్ట్​(ఇండిపెండెన్స్ డే).. వీటిలో ఎప్పుడైనా రావొచ్చని చాలా డేట్సే వినిపిస్తున్నప్పటికీ... కానీ ఏదీ కన్ఫామ్ కావట్లేదు. దీంతో ఆ సమయానికి రావాలనుకున్న ఇతర పెద్ద చిత్రాలు కూడా సందిగ్ధంలోకి వెళ్లిపోయాయి.

ఏదేమైనా సలార్ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఇలా సైలెన్స్ మెయిన్ టెయిన్ చేస్తూ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం మంచిది కాదన్న వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇలానే కంటిన్యూ చేస్తూ సదరు నిర్మాణ సంస్థకు ఉన్న రెపుటేషన్ కూడా దెబ్బతినే అవకాశం ఉందని కూడా అంటున్నారు.

కాబట్టి వీలైనంత త్వరగా సలార్​ ఓ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుని ప్రకటించేస్తే.. ఇతర చిత్రాల మేకర్స్​ ఎటువంటి టెన్షన్ పెట్టుకోకుండా ప్రశాంతంగా.. ఆ సమయానికి రాకుండా ముందో వెనకో తమ కొత్త విడుదల తేదీల్ని కన్ఫామ్ చేసుకుని అనౌన్స్ చేసుకుంటాయి. అభిమానులు కూడా కాస్త హ్యాపీగా ఫీలవుతారు. చూడాలి మరి హోంబలే ఫిల్మ్స్​ ఏం చేస్తుందో..