Begin typing your search above and press return to search.

సలార్ కోసం ఆదిపురుష్ బయ్యర్ల ఆశలు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శాకత్వం

By:  Tupaki Desk   |   25 July 2023 5:29 AM GMT
సలార్ కోసం ఆదిపురుష్ బయ్యర్ల ఆశలు
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శాకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ సలార్. పాన్ ఇండియా లెవల్ లో ఏకంగా 300 కోట్ల భారీ బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ ఈ సినిమాని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సలార్ టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకుంది. దీంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన బిజినెస్ డీల్స్ నడుస్తున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి సంబంధించి రిలీజ్ రైట్స్ కోసం గట్టి పోటీ ఉంది. ఏకంగా నాలుగు పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు సలార్ రైట్స్ కోసం రేసులో ఉన్నాయి. అందులో గీతా ఆర్ట్స్ లాంటి సంస్థ కూడా ఉండటం విశేషం. ఇక ఈ పోటీలో మెయిన్ కాంపిటేటర్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఉందని చెప్పాలి. ఓ వైపు భారీ బడ్జెట్ సినిమాలు, మరో వైపు డిస్టిబ్యూషన్ రైట్స్ తో సినిమా బిజినెస్ లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దూసుకుపోతోంది.

చివరిగా పీపుల్స్ మీడియా ఆదిపురుష్ తెలుగు రాష్ట్రాలకి సంబందించిన రైట్స్ ని ఏకంగా 175 కోట్ల కి కొన్నారు. అయితే ఈ సినిమాతో ఊహించని విధంగా నష్టాలు వచ్చాయి. దానిని పీపుల్స్ మీడియా నుంచి కొన్న బయ్యర్లకి తన నెక్స్ట్ సినిమాల విషయంలో కమిట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సలార్ రైట్స్ కోసం పీపుల్స్ మీడియా గట్టిగా పోటీ పడుతోంది.

సలార్ నిర్మాత విజయ్ కిరంగదూర్ మూవీ తెలుగు రాష్ట్రాల రైట్స్ కోసం ఏకంగా 200 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి ఉన్న హైప్ కారణంగా అంత పెద్ద మొత్తం ఇవ్వడానికి పీపుల్స్ నిర్మాత సిద్ధమైనట్లు తెలుస్తోంది. అలాగే ఆదిపురుష్ ని రిలీజ్ చేసిన బయ్యర్లు కూడా సలార్ సినిమా కోసం పోటీ పడుతున్నారు. ఆదిపురుష్ తో వచ్చిన నష్టాలని సలార్ తో సరిచేసుకోవాలని ఆలోచిస్తున్నారు.

మరి ఈ రేసులో ఫైనల్ గా ఉండేది ఎవరో చూడాలి.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు మాత్రం సినిమాల విషయంలో ఎక్కువగా రిస్క్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందుకే ఓ వైపు పవన్ కళ్యాణ్ తో బ్రో, ప్రభాస్ తో రాజా డీలక్స్ సినిమా భారీ బడ్జెట్ తో చేస్తున్నారు. నెక్స్ట్ ఏకంగా 10 పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేశారు. అలాగే రెండు హాలీవుడ్ సినిమాలలో నిర్మాణ భాగస్వామ్యం అయ్యారు. ఈ ట్రాక్ రికార్డ్ తో సినిమాల పై డిస్టిబ్యూషన్ పరంగా రిస్క్ ని పేస్ చేయడానికి వారు సిద్ధమవుతున్నారు.