Begin typing your search above and press return to search.

సలార్ లో అవి రెండే రెండు..

మొన్నటి వరకు సినిమా అసలు ఇప్పుడైనా అనుకున్న సమయానికి వస్తుందా లేదా అనుమానాలు చాలానే కలిగించారు. అసలైతే సెప్టెంబర్ నెలలో విడుదల చేయాలని అనుకున్నారు.

By:  Tupaki Desk   |   13 Nov 2023 4:54 AM GMT
సలార్ లో అవి రెండే రెండు..
X

పాన్ ఇండియా బిగ్గెస్ట్ మూవీ సలార్ డిసెంబర్ 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ మూవీ గా తెరపైకి రాబోతున్న ఈ సినిమా తప్పకుండా ఫ్యాన్స్ లో అంచనాలను అందుకుంటుంది అని చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంతో ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్ విషయంలో చాలా ఆలస్యం చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు మాత్రం అసలు ఆలస్యం చేయకుండా రెగ్యులర్ గా అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధమయ్యింది.

మొన్నటి వరకు సినిమా అసలు ఇప్పుడైనా అనుకున్న సమయానికి వస్తుందా లేదా అనుమానాలు చాలానే కలిగించారు. అసలైతే సెప్టెంబర్ నెలలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో డిసెంబర్ కు షిఫ్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక డిసెంబర్ 1వ తేదీన సినిమా ట్రైలర్ కూడా విడుదల చేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో రెండే పాటలు ఉన్నాయి అనే విషయంలో కూడా అనేక రకాల గాసిప్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఒక ఐటెం సాంగ్ ఉండబోతుంది అని ఇదివరకే ఒక క్లారిటీ వచ్చింది. అయితే ఇది మొదట ప్లానింగ్ లో లేదు. కానీ సినిమాకు హైప్ పెంచడం కోసం దర్శకుడు మళ్ళీ ఫ్రెష్ గా ఒక ఐటెం సాంగ్ రెడీ చేయించినట్లు సమాచారం.

సంగీత దర్శకుడు రవి బసృర్ ఎప్పటిలానే మళ్లీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే బిజీ అయినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువగా పాటలు లేవు. కేవలం రెండే రెండు పాటలు ఉంటాయట. గతంలో కేజిఎఫ్ లో కూడా ఎక్కువగా సాంగ్స్ తీసుకొని దర్శకుడు ఇప్పుడు సలార్ విషయంలో కూడా అదే ఫార్మాట్లో ముందుకు వెళుతున్నాడు.

ఐటెం సాంగ్ తో పాటు మరొక సాంగ్ ఎలా ఉంటుంది అనేది ప్రమోషన్స్ మొదలైన తరువాత తెలుస్తుంది. ఇక ఐటెం సాంగ్ లో అయితే ప్రభాస్ ఉండడని సమాచారం. అంటే ప్రభాస్ ఐటెం సాంగ్ లో ఎలాంటి స్టెప్పులు వేయడు అని తెలుస్తోంది. ప్రభాస్ కూడా సాంగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇండియాలో లేడు సర్జరీ కోసం విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే.

ఇక మొత్తానికి ఇటీవల హైదరాబాద్లో అడుగుపెట్టిన ప్రభాస్ రెగ్యులర్ ప్రమోషన్స్ కోసం సిద్ధమవుతున్నాడు. మరికొన్ని రోజుల్లో కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా ప్రభాస్ ప్రత్యేకంగా ప్రమోషన్స్ చేయబోతున్నాడు. ప్రభాస్తో పాటు దర్శకుడు అలాగే మరికొంతమంది నటీనటులు ఈ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.