Begin typing your search above and press return to search.

సలార్ లింక్స్.. చివర్లో చెప్పక తప్పలేదు

సౌత్ లో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ మూవీతో థియేటర్స్ లోకి వస్తున్నాడు.

By:  Tupaki Desk   |   21 Dec 2023 10:32 AM GMT
సలార్ లింక్స్.. చివర్లో చెప్పక తప్పలేదు
X

సౌత్ లో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ మూవీతో థియేటర్స్ లోకి వస్తున్నాడు. డార్లింగ్ ప్రభాస్ ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా సినిమాపై భారీ హైప్ నెలకొని ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు ట్రైలర్స్ తో మూవీ కథ ఏంటి అనేది ప్రశాంత్ నీల్ పూర్తిగా క్లారిటీ ఇచ్చేశాడు.

ఇద్దరు ప్రాణస్నేహితులు బద్ధ శత్రువులుగా ఎలా మారారు. మిత్రుడి కోసం వేలమంది సైన్యంతో ఉన్న యుద్ధాన్ని ఆపిన దేవా అదే మిత్రుడికి ఎందుకు ఎదురుతిరిగాడు అనేది సలార్ మూవీలో ఉండబోతోందని చెప్పేశాడు. సింపుల్ గా చెప్పాలంటే సలార్ మూవీ ఇద్దరు మిత్రుల కథ. అయితే ఇలాంటి కథతోనే ప్రశాంత్ నీల్ మొదటి చిత్రం ఉగ్రం తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నాడు.

అందుకే సలార్ మూవీ ఉగ్రంకి రీమేక్ అనే ప్రచారం తెరపైకి వచ్చింది. రెండు సినిమాలలో కథ ఇంచుమించు ఒకే విధంగా ఉందని, అయితే ఉగ్రం కథని గ్రాండ్ స్కేల్ మీద పాన్ ఇండియా లెవల్ లో ఆవిష్కరిస్తున్నారు అని సోషల్ మీడియాలో జోరుగా కథనాలు వినిపించారు. అయితే ఈ రెండు కథలకి అస్సలు సంబంధం లేదనే విషయాన్ని ఇప్పటికే నిర్మాత క్లారిటీ ఇచ్చారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ కూడా స్పష్టత ఇచ్చారు. సలార్ సినిమాని ఉగ్రం, కేజీఎఫ్ లతో పోల్చడం తాను అభినందన అభినందనగానే తీసుకుంటానని తెలిపారు. ఆ రెండు సినిమాలు తన దర్శకత్వంలో తన ఆలోచనల నుంచి వచ్చిన కథలు కాబట్టి ఈ కామెంట్స్ ని పాజిటివ్ గానే తీసుకుంటా అని చెప్పారు.

అలాగే సలార్ ఉగ్రం మూవీ రీమేక్ కాదని, అందులో క్యారెక్టరైజేషన్ అడాప్ట్ చేసుకొని సలార్ కథని కంప్లీట్ గా కొత్త ప్రపంచంలో రాసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు. రెండు సినిమాలకి అస్సలు సారూప్యత ఉండదని, అడాప్ట్ చేసుకోవడం అస్సలు తప్పుకాదని ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ పేర్కొన్నాడు.