Begin typing your search above and press return to search.

క్రిస్మ‌స్ బ‌రిలో `స‌లార్`కి ఎదురే లేదు

పులి సింహం ఏనుగు ఎన్ని ఉన్నా జురాసిక్ పార్క్ లో ప‌ప్పులుడ‌క‌వు అంటూ ప్ర‌శాంత్ నీల్ ఎంతో కాన్ఫిడెంట్ గా డైలాగ్ టీజ‌ర్ ని లాంచ్ చేసాడు.

By:  Tupaki Desk   |   2 Nov 2023 11:11 AM GMT
క్రిస్మ‌స్ బ‌రిలో `స‌లార్`కి ఎదురే లేదు
X

స‌లార్ వ‌ర్సెస్ డంకీ! స‌స్పెన్స్ వీడింది. క్రిస్మ‌స్ బ‌రిలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న రెండు భారీ చిత్రాల్లో ఏ సినిమా హ‌వా సాగిస్తుంది? బాక్సాఫీస్ వ‌ద్ద ఎవ‌రి డామినేషన్ కొన‌సాగుతుంది? అంటూ ట్రేడ్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతున్న సంగ‌తి తెలిసిందే.

రెండిటిలో ఒక‌టి క్లాస్.. మ‌రొక‌టి మాస్ అంటూ చ‌ర్చ సాగుతోంది. ఇప్పటికే స‌లార్ ప్రీటీజ‌ర్ గ్లింప్స్ మాస్ ని ఎగ్జ‌యిట్ చేసింది. పులి సింహం ఏనుగు ఎన్ని ఉన్నా జురాసిక్ పార్క్ లో ప‌ప్పులుడ‌క‌వు అంటూ ప్ర‌శాంత్ నీల్ ఎంతో కాన్ఫిడెంట్ గా డైలాగ్ టీజ‌ర్ ని లాంచ్ చేసాడు. దానికి అభిమానుల నుంచి అద్భుత స్పంద‌న ద‌క్కింది.

ఇప్పుడు రాజ్ కుమార్ హిరాణీ డంకీ టీజ‌ర్ విడుద‌లైంది. ఇది పూర్తిగా ఫ‌న్ హ్యూమ‌ర్ ఎమోష‌న్స్ పై ర‌న్ అవుతుందని క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రంలో మాస్ యాక్ష‌న్ ఎలిమెంట్స్ కంటే ఎమోష‌న్స్ ప్రధానంగా హైలైట్ అవుతాయ‌ని అర్థ‌మైంది. కానీ స‌లార్ అలా కాదు.. ఇది మాస్ యాక్ష‌న్ ఎలిమెంట్స్ తో భారీ పోరాట స‌న్నివేశాలు, అద్భుత‌ ఎమోష‌న్స్ తో సాగుతుంది. అందువ‌ల్ల క్రిస్మ‌స్ బ‌రిలో రిలీజ‌వుతున్న ఈ రెండిటిలో స‌లార్ నే మాస్ ఆడియెన్ ఎంపిక చేసుకునే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా. ఒకవేళ అదే జ‌రిగితే బాక్సాఫీస్ వ‌ద్ద స‌లార్ హ‌వా సాగే అవ‌కాశం ఉంటుంది.

మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ -స‌లార్ 1000 కోట్లు కొల్ల‌గొడుతుంద‌ని ఆ స్థాయిలో ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. బాహుబ‌లి, కేజీఎఫ్ 2 లాంటి చిత్రాలు మాస్ ని థియేట‌ర్ల‌కు ప‌దే ప‌దే ర‌ప్పించ‌డంతోనే 1000 కోట్ల క్ల‌బ్ సాధ్య‌మైంది. స‌లార్ తో ఇది మ‌రోసారి పాజిబుల్ అన్న న‌మ్మ‌కం అభిమానుల‌కు ఉంది.

మ‌రోవైపు రాజ్ కుమార్ హిరాణీ డంకీపైనా పాజిటివ్ బ‌జ్ ఉంది. ఈ చిత్రంలో న‌టించిన న‌టీన‌టులు ఇప్ప‌టికే హిరాణీ ప‌నిత‌నాన్ని, డంకీ కంటెంట్ ని ఆకాశానికెత్తేస్తున్నారు. కింగ్ ఖాన్ షారూఖ్ వ‌రుస విజ‌యాల‌తో దూకుడుమీదున్నాడు. ప‌ఠాన్- జ‌వాన్ విజ‌యాల‌తో హుషారుగా ఉన్న ఖాన్ హ్యాట్రిక్ కొట్టాల‌ని క‌సిగా ఉన్నాడు. విదేశాల‌కు వల‌స వెళ్లే భార‌తీయుల వెత‌ల నేప‌థ్యంలోని సినిమా ఇది. డంకీ ఉత్త‌రాదిన పెద్ద హిట్ట‌య్యే ఛాన్సుంది. అయితే ఈ సినిమాలోని కంటెంట్ సౌత్ లో ఎంత‌వ‌ర‌కూ క‌నెక్టవుతుందో చూడాలి. కొత్త సంవ‌త్స‌రంలో ప్ర‌వేశించే ముందే స‌లార్- డంకీ లాంటి క్రేజీ చిత్రాల్ని థియేట‌ర్ల‌లో ఆస్వాధించే అవ‌కాశం అభిమానుల‌కు ఉంది.