Begin typing your search above and press return to search.

'సలార్‌' హాలీవుడ్ వర్షన్‌ ఉందా? లేదా?

ఇక్కడ వచ్చే రెస్పాన్స్ ను బట్టి ఇంగ్లీష్ లో విడుదల చేసే విషయమై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   3 Aug 2023 1:30 PM GMT
సలార్‌ హాలీవుడ్ వర్షన్‌ ఉందా? లేదా?
X

పాన్ ఇండియా సూపర్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ సెన్షేషన్‌ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సలార్‌' సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. కేజీఎఫ్ ను ఎలా అయితే రెండు ఛాపర్ట్‌ లుగా విడుదల చేశాడో సలార్‌ ను కూడా రెండు ఛాపర్ట్ లుగా విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

సౌత్ ఇండియన్‌ భాషలన్నింటితో పాటు హిందీలో కూడా సలార్‌ సినిమా ను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే పాన్‌ ఇండియా రేంజ్ లో సలార్‌ 1 ప్రమోషన్ మొదలైంది. సెప్టెంబర్‌ లో ఇండియన్ లాంగ్వేజ్‌ ల్లో రాబోతున్న సలార్‌ సినిమా ను ఇంగ్లీష్ లో కూడా డబ్‌ చేసే యోచనలో ప్రశాంత్‌ నీల్ ఉన్నాడు అంటూ ఆమధ్య వార్తలు వచ్చాయి.

తాజాగా కన్నడ సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం సలార్ సినిమా ను ఇండియన్ భాషల్లో విడుదల చేసిన సమయం లోనే ఇంగ్లీష్ లో విడుదల చేయాలని అనుకోవడం లేదట. ఇక్కడ వచ్చే రెస్పాన్స్ ను బట్టి ఇంగ్లీష్ లో విడుదల చేసే విషయమై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

హాలీవుడ్‌ లో సలార్‌ ఉంటుందా లేదా అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. కానీ ప్రభాస్ అభిమానులు మాత్రం సలార్‌ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం.. పాన్ ఇండియా రేంజ్ లో రికార్డు స్థాయి వసూళ్లు నమోదు చేయడం ఖాయం అంటూ ధీమాతో ఉన్నారు. ఇండియన్‌ లాంగ్వేజ్‌ ల్లో వెయ్యి కోట్ల వసూళ్లు సాధించబోతున్న సలార్‌ ను ఇంగ్లీష్ లో కూడా విడుదల చేయడం ఖాయం అని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్ ను రెండు విభిన్నమైన పాత్రల్లో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా లో హీరోయిన్‌ గా శృతి హాసన్‌ నటిస్తోంది. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ సినిమా అనగానే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక వరుసగా సాహో.. రాధేశ్యామ్‌.. ఆదిపురుష్ సినిమాల తో నిరాశ పరిచిన ప్రభాస్ సలార్‌ తో సక్సెస్‌ ట్రాక్ ఎక్కాలని ఆశ పడుతున్నాడు. మరి సాధ్యమేనా చూడాలి.