Begin typing your search above and press return to search.

సలార్' హిందీ కలెక్షన్స్.. రెండో రోజు మరింత ఎక్కువగా!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'సలార్' మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 Dec 2023 6:35 PM GMT
సలార్ హిందీ కలెక్షన్స్.. రెండో రోజు మరింత ఎక్కువగా!
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'సలార్' మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. మొదటి రోజే ఈ సినిమా రూ.178 కోట్ల గ్రాస్ అందుకొని ఈ ఇయర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

కేవలం సౌత్ లోనే కాదు నార్త్ లోనూ 'సలార్' మ్యానియా కొనసాగుతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కి బాలీవుడ్ లో భారీ క్రేజ్ పెరిగింది. సాహో సినిమా యావరేజ్ టాక్ తోనే హిందీలో రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. బాహుబలి తర్వాత నార్త్ లో ప్రభాస్ కి భారీ మార్కెట్ ఏర్పడింది. ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ అయిన 'సలార్' నార్త్ లో అదిరిపోయే కలెక్షన్స్ ని రాబడుతోంది.

సలార్ రిలీజ్ అయిన రెండవ రోజు అంటే శనివారం కేవలం హిందీ బెల్ట్ లోనే దాదాపు రూ.16 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. అంటే ఓపెనింగ్ డే కంటే రెండో రోజే ఈ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ రావడం విశేషం. నిజానికి బాలీవుడ్ లో షారుక్ ఖాన్ 'డంకి' తో 'సలార్' కి గట్టి పోటీ ఉన్నా కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే మామూలు విషయం కాదు. ఇక రెండు రోజులకు కలుపుకొని దాదాపు రూ.31 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుంది.

ఈ ఊపు చూస్తుంటే కేవలం హిందీలోనే ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యలోపు రూ.50 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని రాబట్టడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దానికి తోడు సలార్ కి క్రిస్మస్ హాలిడే కూడా కలిసొస్తుంది. హాలిడే రోజు బాలీవుడ్ లో ఈ మూవీ మరింత ఎక్కువ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది. ఇక ఇక షారుక్ ఖాన్ 'డంకీ' రిలీజ్ అయిన మూడో రోజు సుమారు రూ.24 నుంచి రూ.25 కోట్ల నెట్ కలెక్షన్స్ ని రాబట్టింది.

ఇది డీసెంట్ నెంబర్ అయినప్పటికీ షారుక్ ఖాన్ మార్కెట్ కి అప్ టూ ద మార్క్ అయితే కాదు. డంకి సినిమా కేవలం ముంబై, ఢిల్లీ, కోల్ కత్తా వంటి పెద్ద నగరాల్లోనే బాగా ఆడుతుంది. ఇక బెంగళూరులో అయితే మొత్తం సలార్ ప్రభంజనమే నడుస్తుంది. మొత్తం మూడు రోజుల్లో 'డంకీ' సినిమాకి రూ.72 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే ఆదరిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫుల్ రన్ లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలి.