Begin typing your search above and press return to search.

సలార్ ఫ్యాన్స్.. గేట్ రెడీ

ఈ మూవీ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, తాజాగా ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు.

By:  Tupaki Desk   |   25 Aug 2023 9:22 AM GMT
సలార్ ఫ్యాన్స్.. గేట్ రెడీ
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ డిజాస్టర్ అయ్యింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆదిపురుష్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో, ఫ్యాన్స్ ఆశలన్నీ సలార్ పైనే పెట్టుకున్నారు. కాగా, ఈ మూవీకి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ విపరీతంగా ఆకట్టుకుంది.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, తాజాగా ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ మూవీ ట్రైలర్ ని సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేయాలని వారు భావిస్తున్నారు. దాదాపు సెప్టెంబర్ 7వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది.

ట్రైలర్ చూసిన తర్వాత ఈ మూవీ పై ఓ క్లారిటీ రానుంది. ఇప్పటికే కేజీఎఫ్ తో ప్రశాంత్ నీల్ , యష్ కి కెరీర్ లోనే గుర్తుండిపోయే బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. మరి, ప్రస్తుతం వరస వైఫల్యాలతో ఉన్న ప్రభాస్ కి ఈ సలార్ మూవీ మంచి బూస్టప్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక, సినిమా కూడా సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేస్తున్నారు.

ఈ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కించాలని డైరెక్టర్ భావిస్తున్నారు. ముందు మొదటి భాగం వస్తుంది. రెండో భాగానికి మరి కొంతకాలం పట్టే అవకాశం ఉంది. ఇక, ఈ సినిమాలో జగపతి బాబు విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఆయన మాత్రమే కాదు, కేజీఎఫ్ లో లాగా, ఇందులోనూ చాలా మంది విలన్స్ ఉండే అవకాశం ఉందని సమాచారం.

ఇక, ప్రభాస్ ఈ సినిమాతో బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్ని హోత్రి దర్శకత్వం వహించిన వ్యాక్సిన్ మూవీ పోటీ పడుతోంది. ఇది కూడా సెప్టెంబర్ 28వ తేదీనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ రెండు సినిమాల్లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. సలార్ లో ప్రభాస్ కి జోడిగా శ్రుతి హాసన్ నటిస్తోంది. ఈ మూవీ తర్వాత ప్రభాస్ ప్రాజెక్ట్ కె కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి లైన్ లో ఉంది.