Begin typing your search above and press return to search.

స‌లార్ ఫ్యాన్‌మేడ్ లిరిక‌ల్ వీడియో గూస్‌బంప్స్

స‌లార్ రేంజును ఎలివేట్ చేసే లిరికల్ వీడియో ఇది. పాట‌లోని సాహిత్యం వెన్ను జలదరించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ర‌క్తి క‌ట్టించాయి.

By:  Tupaki Desk   |   18 Aug 2023 4:04 AM GMT
స‌లార్ ఫ్యాన్‌మేడ్ లిరిక‌ల్ వీడియో గూస్‌బంప్స్
X

ప్ర‌భాస్ న‌టించిన 'స‌లార్: పార్ట్ 1- సీజ్ ఫైర్' విడుదల కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. టీజ‌ర్ తో హైప్ ప‌రాక‌ష్ట‌కు చేరుకోవ‌డంతో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని థియేట‌ర్ల‌లో వీక్షించాల‌ని ప్ర‌జ‌లు ఫిక్స‌య్యారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రిలీజ్‌కు కౌంట్ డౌన్ మొద‌లైంది. ఇంత‌లోనే ఔత్సాహిక అభిమాని ప్ర‌య‌త్నం మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తాజాగా స‌లార్ ఫ్యాన్ మేడ్ లిరికల్ వీడియో అంత‌ర్జాలాన్ని కుదిపేస్తోంది.

ఈ లిరిక‌ల్ వీడియో యాక్షన్-ప్యాక్డ్ సాగా 'స‌లార్' సారాంశాన్ని ఎలివేట్ చేస్తూ సాగుతోంది. ముఖ్యంగా ప్ర‌భాస్ పాత్ర తీరుతెన్నుల‌ను ఎలివేట్ చేస్తూ అత‌డు ఒక సుల్తాన్ అంటూ పొగిడేస్తూ లిరిక్ ని ర‌క్తి క‌ట్టించారు.

స‌లార్ రేంజును ఎలివేట్ చేసే లిరికల్ వీడియో ఇది. పాట‌లోని సాహిత్యం వెన్ను జలదరించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ర‌క్తి క‌ట్టించాయి. టైటిల్ పాట‌ కోసం అభిమానుల‌ అంకితభావాన్ని తెలియ‌జేస్తూ వీడియోను మేక‌ర్స్ స్వ‌యంగా సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసారు. అభిమానుల నుండి తిరుగులేని మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాత‌లు షేర్ చేసిన‌ వీడియోతో పాటు క్యాప్ష‌న్ ఇలా ఉంది.

''స‌లార్ స్ఫూర్తితో ఈ అద్భుతమైన ఫ్యాన్ మేడ్ సాంగ్ ఎడిట్‌ను ఆస్వాధించండి. మీ అభిరుచి మమ్మల్ని ముందుకు తీసుకువెళుతుంది! మేము భారీ స్థాయిలో సినిమాని తెర‌కెక్కిస్తున్నాం. త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌లో.. ధైర్యంగా ఉండండి. #Salaar. Wave & Team, You guys అద్భుతం'' అంటూ వ్యాఖ్య‌ను జోడించారు. ప్ర‌స్తుతం ఫ్యాన్ మేడ్ లిరిక‌ల్ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.

మోస్ట్ అవైటెడ్ స‌లార్ 28 సెప్టెంబర్ 2023న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతోంది. ఇందులో శ్రుతిహాస‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు-త‌మిళం-హిందీ-క‌న్న‌డం-మ‌ల‌యాళంలో విడుద‌ల చేయ‌నున్నారు. ఆంగ్ల భాష‌లోను విడుద‌ల చేస్తార‌ని గుస‌గుస‌లు వినిపించాయి.