Begin typing your search above and press return to search.

సలార్.. ఓ ప్రాబ్లమ్ సాల్వ్

'సలార్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ విక్రయాలు జరిగాయని తెలిసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం అందింది.

By:  Tupaki Desk   |   13 Sep 2023 6:17 AM GMT
సలార్.. ఓ ప్రాబ్లమ్ సాల్వ్
X

'సలార్' కొత్త విడుదల తేదీ కోసం రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా, ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ నెల 28 నుంచి సినిమా వాయిదా పడినట్లు మేకర్స్ ప్రకటించారు. వీఎఫ్ఎక్స్ బాగోలేదని, డిజిటల్ రైట్స్ విక్రయాలు జరగలేదని.. వాయిదా ప్రచారంలో ఇలా రకరకాల మాటలు వినిపించాయి. అయితే తాజాగా ఇప్పుడీ సినిమాకు సంబంధించి ఓ కొత్త కబురు తెలిసింది.

'సలార్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ విక్రయాలు జరిగాయని తెలిసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం అందింది. భారీ ధరకు ఈ డీల్ జరిగిందని అంటున్నారు. అయితే సౌత్ ఇండియా తెలుగు, తమిళ, కన్నడ భాషల ఓటీటీ రైట్స్ మాత్రమే నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. హిందీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ పై క్లారిటీ రాలేదు.

ఇకపోతే ఈ చిత్రాన్ని సాధ్యమైనంతవరకు ఈ ఏడాది ఆఖరి నెలలోనే రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. నవంబర్ లేదా డిసెంబర్ లో చేసే అవకాశముందని అంటున్నారు. రిలీజ్ డేట్ ఏదైనా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే. మూవీటీమ్ త్వరలోనే చెబుతామని తాజాగా అధికారికంగా ప్రకటించింది. సినిమాకు సంబంధించిన పనులు పూర్తి కావడంపై కొత్త విడుదల తేదీ ఆధారపడి ఉంటుంది.

ఇక 'సలార్' సెప్టెంబర్ 28 నుంచి వాయిదా పడటం వల్ల ఆ రోజు రామ్ పోతినేని 'స్కంద' రాఘవా లారెన్స్ 'చంద్రముఖి 2', 'పెదకాపు 1', 'ది వ్యాక్సిన్ వార్' వంటి చిత్రాలు ఒక్క రోజు అటు ఇటుగా బాక్సాఫీస్ ముందు పోటీ పడనున్నాయి.

కాగా, 'కేజీయఫ్ 2' తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో 'సలార్'పై భారీ ఆశలు ఉన్నాయి. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మించారు. శృతి హాసన్ హీరోయిన్ నటించింది. వరదరాజ మన్నార్ గా మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, రాజ మన్నార్ గా సీనియర్ నటుడు జగపతి బాబు పవర్ ఫుల్ విలన్లుగా నటించారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భువన గౌడ సినిమాటోగ్రాఫర్ గా ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు.