Begin typing your search above and press return to search.

సలార్‌ కలెక్షన్స్‌... పవన్‌ మూవీ హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొంది నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సలార్‌' కి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్‌ దక్కింది.

By:  Tupaki Desk   |   23 Dec 2023 7:41 AM GMT
సలార్‌ కలెక్షన్స్‌... పవన్‌ మూవీ హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌
X

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొంది నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సలార్‌' కి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్‌ దక్కింది. రికార్డ్ బ్రేకింగ్‌ ఓపెనింగ్స్ ను సలార్‌ సినిమా దక్కించుకోబోతుంది అంటూ ఇప్పటికే తేలిపోయింది. సలార్ బ్యాక్ డ్రాప్ తో పాటు, ప్రభాస్ ను దర్శకుడు ప్రశాంత్‌ నీల్ చూపించిన తీరుకు అంతా కూడా ఫిదా అవుతున్నారు.

బాహుబలి 2 తర్వాత ప్రభాస్ ను ఇలా చూడటం చాలా సంతోషంగా ఉందని, ఇన్నాళ్లకు ప్రభాస్ కు తగ్గ సినిమా పడిందని అభిమానులు అంటున్నారు. సలార్‌ కి ఏ రేంజ్ లో అయితే బజ్ క్రియేట్‌ అయ్యిందో... సినిమాలో ఎలా అయితే ప్రభాస్ ను దర్శకుడు చూపించాడో 'ఓజీ' సినిమాలో పవన్‌ ను దర్శకుడు సాహో సుజీత్ అలాగే చూపించబోతున్నాడని పవన్‌ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.

సాహో దర్శకుడు సుజీత్‌ దర్శకత్వంలో ముంబై గ్యాంగ్‌స్టర్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో ఓ భారీ యాక్షన్ డ్రామాగా 'ఓజీ' సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. దాదాపు సగం షూటింగ్‌ పూర్తి అయిన ఓజీ ని ఇదే ఏడాది లో విడుదల చేయాలని భావించినా కూడా పవన్‌ రాజకీయాల కారణంగా బిజీగా ఉండటంతో సినిమా షూటింగ్‌ ను ముగించలేక పోయాడు.

సలార్‌ కు నమోదు అవుతున్న తెలుగు రాష్ట్రాల ఓపెనింగ్ కలెక్షన్స్ ను మా 'ఓజీ' సినిమా మాత్రమే బ్రేక్‌ చేయగలదు అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ ‘They Call Him OG’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ ను సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ లో తెగ షేర్‌ చేశారు. దాంతో ఆ హ్యాష్‌ ట్యాగ్‌ జాతీయ స్థాయిలో ట్రెండ్‌ అవ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది.

ఎప్పుడు వస్తుందో కూడా తెలియని సినిమా హ్యాష్ ట్యాగ్‌ కి ఆ రేంజ్ లో స్పందన వచ్చింది అంటే 'ఓజీ' సినిమా విడుదల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పవన్‌ కళ్యాణ్ ఫ్యాన్స్ గట్టిగా తల్చుకుంటే.. ఓజీకి పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తే కచ్చితంగా ఓపెనింగ్ కలెక్షన్స్ విషయంలో రికార్డులు బద్దలు అవ్వడం ఖాయం అని ప్రభాస్ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు.