Begin typing your search above and press return to search.

ఆ విషయంలో ఫ్యాన్స్ ని నిరాశ పరచనున్న సలార్

డార్లింగ్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ అయిన చిత్రం సలార్

By:  Tupaki Desk   |   3 Jan 2024 3:35 AM GMT
ఆ విషయంలో ఫ్యాన్స్ ని నిరాశ పరచనున్న సలార్
X

డార్లింగ్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ అయిన చిత్రం సలార్. ఈ మూవీ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికి డీసెంట్ కలెక్షన్స్ తో థియేటర్స్ లో ఆడియన్స్ ని ఎంటెర్టైన్ చేస్తోంది. హోంబలే ఫిలిమ్స్ ఖాతాలో సలార్ తో మరో సూపర్ హిట్ పడినట్లే అని చెప్పాలి. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత ఆ స్థాయిలో దేశ వ్యాప్తంగా సలార్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది.

ఇప్పటి వరకు ఈ సినిమా ఆరు వందల కోట్లకి పైగా కలెక్ట్ చేసి 700 కోట్ల క్లబ్ లో చేరడానికి సిద్ధం అవుతోంది. వీకెండ్, న్యూ ఇయర్ సమయంలో కలెక్షన్స్ బాగా వచ్చాయి. బాహుబలి చాప్టర్ 2 తర్వాత ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ కోరుకునే సాలిడ్ హిట్ ఈ చిత్రంతో లభించింది. సలార్ మూవీ ఇప్పటికే ఓవర్సీస్, నైజాం ఏరియాలో బ్రేక్ ఈవెన్ అందుకుంది.

హిందీలో వంద కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిపోయింది. బ్రేక్ ఈవెన్ కూడా అందుకోనుంది. ఆంధ్రాలో కూడా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ కి దగ్గరగా ఉంది. ఇంకా సంక్రాంతి వరకు చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ లేకపోవడంతో సలార్ జోరు అంత వరకు కొనసాగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న కలెక్షన్స్, థియేటర్స్ ఆక్యుపెన్సీ చూస్తుంటే సలార్ మూవీ వెయ్యి కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం లేదనిపిస్తుంది.

కచ్చితంగా ఈ మూవీ వెయ్యి కోట్ల మార్క్ దాటుతుందని ట్రేడ్ పండితులు ఎక్స్ పెక్ట్ చేశారు. అలాగే డార్లింగ్ ఫ్యాన్స్ కూడా అంచనా వేశారు. అందుకోవాలని చాలా మంది ఆశించారు కూడా. సినిమాకి అదే రేంజ్ లో ఓపెనింగ్ డే రోజు రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రభాస్ గత సినిమాలు ఫ్లాప్ అయిన నార్త్ బెల్ట్ లో మంచి వసూళ్లు సాధించాయి. కానీ సలార్ నార్త్ లో పుంజుకోవడానికి చాలా సమయం తీసుకుంది.

దీనికి కారణం ప్రశాంత్ నీల్ సలార్ కోసం ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోవడమే అనే మాట వినిపిస్తోంది. సలార్ మూవీకి ప్రత్యేకంగా ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం లేదని ప్రశాంత్ నీల్ బలంగా ఫిక్స్ అయ్యాడు. ఈ కారణంగానే ప్రమోషన్ యాక్టివిటీస్ పై పెద్దగా దృష్టి పెట్టలేదు. ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా చేయలేదు. ఈ ఇంపాక్ట్ నార్త్ లో బాగా కనిపించింది. అక్కడ సలార్ కి పోటీగా షారుఖ్ ఖాన్ డంకీ కూడా రిలీజ్ కావడంతో మొదటి ప్రాధాన్యత ఆ చిత్రానికి ఇచ్చారు. దీంతో సలార్ కలెక్షన్స్ మీద డంకీ తీవ్ర ప్రభావం చూపించింది. ఈ స్థాయిలోసక్సెస్ వచ్చినందుకు ఇప్పటికే సలార్ వెయ్యి కోట్లు కలెక్షన్స్ దాటిపోయి ఉండాలని సినీ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు.