Begin typing your search above and press return to search.

సలార్ A.. ఊచకోత ఏ రేంజ్ లో ఉంటుందో..

సినిమాలో రక్తపాతం, హింసాత్మక సన్నివేశాలు చాలానే ఉండడంతో సెన్సార్ టీం ఈ చిత్రానికి 'A'(అడల్ట్) సర్టిఫికెట్ జారీ చేసింది.

By:  Tupaki Desk   |   11 Dec 2023 11:39 AM GMT
సలార్ A.. ఊచకోత ఏ రేంజ్ లో ఉంటుందో..
X

ఇండియన్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సలార్ మరో పది రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయబోతోంది. రిలీజ్ టైం దగ్గర పడడంతో సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా సలార్ మూవీకి సెన్సార్ టీం 'A' సర్టిఫికేట్ ఇవ్వడం షాకింగ్ గా మారింది.


సినిమాలో రక్తపాతం, హింసాత్మక సన్నివేశాలు చాలానే ఉండడంతో సెన్సార్ టీం ఈ చిత్రానికి 'A'(అడల్ట్) సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే 18 సంవత్సరాలు పైబడిన వాళ్లే ఈ సినిమాని థియేటర్ లో చూసేందుకు అర్హులన్నమాట. ఇక సలార్ రన్ టైం విషయానికొస్తే 2 గంటల 55 నిమిషాల 22 సెకండ్లు కావడం విశేషం. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన ఫస్ట్ మూవీ నుంచి లాంగ్ రన్ టైంని మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. గత ఏడాది వచ్చిన కేజిఎఫ్ 2 రన్ టైం 2 గంటల 48 నిమిషాలు గా ఉంది.

ఇప్పుడు సలార్ రన్ టైం కేజీఎఫ్ 2 నుంచి ఉండబోతోంది. ట్రైలర్ చూసినప్పుడే సినిమాలో వైలెన్స్ ఓ రేంజ్ లో ఉండబోతుందని అర్థం అయింది. కాబట్టి సలార్ కి సెన్సార్ యూనిట్ 'A' సర్టిఫికెట్ ఇవ్వడంలో తప్పులేదు. డిసెంబర్ 22న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఆరోజు అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాల నుంచే షో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కాగా సలార్ మూవీ కి మరో పాన్ ఇండియా సినిమా 'డంకీ' బాక్సాఫీస్ దగ్గర భారీ పోటీ ఇవ్వనుంది.

సలార్ కంటే ఒక్కరోజు ముందుగానే అంటే డిసెంబర్ 21 నే ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. దాంతో ఈ ఇద్దరు స్టార్ హీరోల్లో బాక్సాఫీస్ దగ్గర ఎవరు పై చేయి సాధిస్తారనే అంశం ఇరు ఇండస్ట్రీల్లోనూ ఆసక్తికరంగా మారింది. చాలా కాలం తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న కంప్లీట్ యాక్షన్ మూవీ కావడంతో సలార్ కోసం డార్లింగ్ ఫాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో కేజీఎఫ్ సినిమాను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రభాస్ సరసన శృతిహాసన్ కథానాయకగా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు విలన్స్ గా కనిపించనున్నారు. ఈశ్వరి రావు, శ్రీయ రెడ్డి, టీనూ ఆనంద్, సప్తగిరి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న సలార్ పార్ట్-1 సీజ్ ఫైర్ పేరుతో విడుదల కానుంది.