Begin typing your search above and press return to search.

సలార్.. మైత్రి వాళ్ళు సేఫె కానీ

ప్రపంచవ్యాప్తంగా రూ.175 కోట్లకుపైగా ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.

By:  Tupaki Desk   |   5 Jan 2024 8:25 AM GMT
సలార్.. మైత్రి వాళ్ళు సేఫె కానీ
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన సలార్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రూ.175 కోట్లకుపైగా ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. వరల్డ్ వైడ్ గా అనేక రికార్డులను బ్రేక్ చేసింది.

అయితే ప్రేక్షకులు, క్రిటిక్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడంతో నైజాంలో రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేసింది సలార్ మూవీ. ఇప్పటి వరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. గత 13 రోజుల్లో ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్ల మైలురాయిని అధిగమించింది. డిస్ట్రిబ్యూటర్ కు లాభాల వర్షం కురిపిస్తోంది.

అయితే నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్ రైట్స్ ను రూ.65 కోట్లకు కొనుగోలు చేసిన మైత్రీ మూవీ మేకర్స్.. సలార్ భారీ మొత్తంలో బిజినెస్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. నైజాం మొత్తంలో రికార్డు స్థాయిలో థియేటర్లలో సినిమాను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుని ఎక్స్ ట్రా షోలు కూడా ప్రదర్శించింది. నైజాంలో ప్రస్తుతం ఈ సినిమా లాభాల బాటలో రన్ అవుతోంది.

ఒకవిధంగా మైత్రి వాళ్ళు అధిక రేటుకు తీసుకుని రిస్క్ చేశారు అనే కామెంట్స్ వచ్చాయి. కానీ మొత్తానికి సినిమా రెండు వారాల టైమ్ లో ప్రాఫిట్స్ ఇస్తోంది. ఇక సంక్రాంతి వరకు పెద్దగా పోటీ లేదు కాబట్టి అప్పటి వరకు ఫుల్ రన్ లో మరింత లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఆ లెక్క ఎంతవరకు వెళుతుందో.

ఇటీవలే నైజాంలో బాహుబలి-2 సినిమా కలెక్షన్లను సలార్ బ్రేక్ చేసింది. దాంతో నైజాం బాక్సాఫీస్ వద్ద సలార్ మూవీ సరికొత్త చరిత్రను సృష్టించింది. ప్రభాస్ తన పేరును ఉన్న రికార్డును తానే అధిగమించడం ట్రేడ్ వర్గాల్లో ఉత్సాహం నింపింది.

అంతకుముందు, నైజాంలో నాన్ ఆర్ ఆర్ ఆర్ రికార్డును క్రియేట్ చేసింది సలార్. నైజాం ఏరియాలో మొదటి రోజు 22.55 కోట్ల షేర్‌ ను రాబట్టింది. అయితే ఈ ఏరియాలో 23.35 కోట్ల షేర్‌ తో టాప్ ప్లేస్‌ లో ఉంది ఆర్ ఆర్ ఆర్. ఇప్పుడు సలార్ సెకండ్ ప్లేస్‌ లో నిలిచింది. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ఇమేజ్ అండ్ మార్కెట్ ను దృష్టిలో చూస్తే ప్రభాస్ సోలోగానే వచ్చి అద్భుతం చేసి చూపించారనే చెప్పాలి.

వాస్తవానికి.. సలార్ సినిమాను 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు మేకర్స్. ఈ మూవీ రూ.350 కోట్లకుపైగా ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటి వరకు ఈ చిత్రం హిందీ, తెలుగు కలిపి రూ.440 కోట్లు, ఓవర్సీస్‌లో ఈ చిత్రం రూ.134 కోట్లు షేర్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.610 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసి భారీ లాభాలను సొంతం చేసుకుంది.