Begin typing your search above and press return to search.

అక్కడ సలార్ కోసం స్ట్రాంగ్ ఫైట్

సలార్ కి పోటీగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాని డుంకీ మూవీ రిలీజ్ అవుతోంది. షారుఖ్ ఈ ఏడాది వరుస రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ తో జోరు మీద ఉన్నాడు

By:  Tupaki Desk   |   9 Oct 2023 4:15 AM GMT
అక్కడ సలార్ కోసం స్ట్రాంగ్ ఫైట్
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ సలార్. ఈ మూవీ డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషలలో రిలీజ్ కాబోతోంది. భారీ అంచనాల మధ్య సిద్ధమవుతోన్న ఈ మూవీ నాన్ థీయాట్రికల్ బిజినెస్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. థీయాట్రికల్ రైట్స్ కూడా చాలా చోట్ల అమ్ముడైపోయాయి. సినిమాపైన ఏకంగా 300 కోట్ల వరకు బిజినెస్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

సలార్ కి పోటీగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాని డుంకీ మూవీ రిలీజ్ అవుతోంది. షారుఖ్ ఈ ఏడాది వరుస రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ తో జోరు మీద ఉన్నాడు. అయిన కాని ఈ రెండింటిలో ఎక్కువ మంది చూడటానికి ఆసక్తి చూపించే సినిమాల జాబితాలో సలార్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. దీనిని బట్టి సలార్ మూవీ పట్ల దేశ వ్యాప్తంగా ఆడియన్స్ ఎంత క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన మరో ఇంటరెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. యూఏలో సలార్ రిలీజ్ రైట్స్ కోసం ప్రముఖ డిస్టిబ్యూటర్ ఏకంగా 20.04 కోట్లు ఆఫర్ చేశారంట. అందులో 20 శాతం నాన్ రిఫండ్ కమిషన్ ఇస్తామని ఆఫర్ కూడా చెప్పారంట. అయిన కాని హోంబలే ఒకే చెప్పలేదని తెలుస్తోంది. మరో నలుగురు డిస్టిబ్యూటర్స్ సలార్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారంట.

ఒక్క ట్రైలర్ రిలీజ్ అయితే బిజినెస్ లెక్కలు అన్ని కూడా మారిపోతాయి. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సినిమా నుంచి ఒక ట్రైలర్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అలాగే రిలీజ్ ముందు మరో ఇంటరెస్టింగ్ ట్రైలర్ ఒకటి అందించడానికి ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడంట. మూవీపై హైఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేయడంతో పాటు కచ్చితంగా సాలిడ్ హిట్ ని ప్రభాస్ కి ఇవ్వాలనే కసితో ప్రశాంత్ నీల్ వర్క్ చేస్తున్నారు.

బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన మూడు సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ లు అందుకోలేదు. కలెక్షన్స్ పరంగా గట్టిగానే వచ్చిన అవి ఓవరాల్ గా మూవీస్ ని నిలబెట్టలేకపోయాయి. అయిన కూడా ప్రభాస్ ఇమేజ్ ఏ మాత్రం చెక్కుచెదరలేదని సలార్ మూవీ ప్రూవ్ చేస్తోంది.