Begin typing your search above and press return to search.

సలార్' బుకింగ్స్.. అభిమాని దెబ్బకు మల్టీప్లెక్స్ దండం

ఇదిలా ఉంటే హైదరాబాదులో పాపులర్ థియేటర్ ప్రసాద్ ఐమాక్స్ లో మాత్రం ఇంకా సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాలేదు

By:  Tupaki Desk   |   21 Dec 2023 3:13 PM GMT
సలార్ బుకింగ్స్.. అభిమాని దెబ్బకు మల్టీప్లెక్స్ దండం
X

తెలంగాణలో 'సలార్' సినిమాని విడుదల చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ సినిమాకు ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ కాకుండా థియేటర్ దగ్గరికి వెళ్లి టికెట్ తీసుకునేలా ప్లాన్ చేయగా ఎవరూ ఊహించని విధంగా థియేటర్స్ వద్ద ఆడియన్స్ బారులు తీరడం, పోలీసులు కూడా వాళ్ళని అదుపు చేయలేకపోవడం, అభిమానులు థియేటర్స్ వద్ద టికెట్లు దొరకక గొడవలు పడడం అన్ని జరిగిపోయాయి. ఈ రచ్చను కాస్త కంట్రోల్ చేసేందుకు మూవీ టీం ఆ తర్వాత ఆన్లైన్ బుకింగ్స్ ఓపెన్ చేసారు.


ఇదిలా ఉంటే హైదరాబాదులో పాపులర్ థియేటర్ ప్రసాద్ ఐమాక్స్ లో మాత్రం ఇంకా సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాలేదు. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ప్రసాద్ ఐమాక్స్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఓ అభిమాని ప్రసాద్ ఐమాక్స్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ కు అనేక సందేశాలు పంపాడు.

ఆన్లైన్లో టికెట్స్ బుకింగ్ పెట్టమని వరుస మెసేజ్ లు పంపుతుండగా ఎట్టకేలకు స్పందించిన ప్రసాద్ మల్టీప్లెక్స్ యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా ఇచ్చిన రెస్పాన్స్ వైరల్ గా మారింది. అభిమాని చేస్తున్న పోస్టులకు ప్రసాద్ ఐమాక్స్ యాజమాన్యం.." టికెట్ ఇస్తా తీసుకో ఇంకా మెయిల్స్, DM లు ఆపేయ్ బాబోయ్" అంటూ ఓ యూజర్ ఓపెన్ ట్వీట్ కి ప్రతిస్పందించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది.

మరోవైపు సెలబ్రిటీస్ కి ఫ్యాన్స్ కి ఫేవరెట్ థియేటర్ అయిన ప్రసాద్ ఐమాక్స్ లో సలార్ ఫస్ట్ డే ఏకంగా 30 షోలను ప్రదర్శించబోతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు మరే హీరో సినిమాకి రిలీజ్ డే రోజు ఇన్ని షోలు ప్రదర్శించింది లేదు. అది కేవలం ప్రభాస్ సలార్ సినిమాకి మాత్రమే దక్కడం విశేషం. మరోవైపు అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే రికార్డుల వేట మొదలుపెట్టిన సలార్ రాబోయే పాన్ ఇండియా సినిమాలకు సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది.

సినిమా రిలీజ్ కి ఇంకా 12 గంటల సమయం మిగిలి ఉండగానేసలార్ సినిమాకి సంబంధించి ఏకంగా 30 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో 13 లక్షల 25000, నైజాం 6 లక్షలు, నార్త్ ఇండియా 5,25,000, కర్ణాటక 3. 25 వేలు, కేరళ లో లక్షన్నర, తమిళనాడులో లక్ష మొత్తం 30 లక్షల 25 వేల టికెట్లు అమ్ముడుపోయినట్లు సలార్ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.