Begin typing your search above and press return to search.

వీడియో : 'సలార్‌' బ్లాక్‌ బస్టర్‌ వేడుక

రికార్డ్‌ స్థాయిలో సినిమా వసూళ్లను నమోదు చేసిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   16 Jan 2024 8:36 PM GMT
వీడియో : సలార్‌ బ్లాక్‌ బస్టర్‌ వేడుక
X

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వలో రూపొంది గత ఏడాది చివర్లో విడుదల అయిన సలార్‌ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రికార్డ్‌ స్థాయిలో సినిమా వసూళ్లను నమోదు చేసిన విషయం తెల్సిందే. సినిమాకు సంబంధించిన సక్సెస్ వేడుకను భారీ ఎత్తున బెంగళూరులో నిర్వహించడం జరిగింది.

ఆ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు మరియు వీడియోలు వచ్చాయి. అయితే తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా విడుదల చేసిన వీడియో లో సలార్ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ సెలబ్రేషన్ ఏ స్థాయిలో జరిగిందో చెప్పకనే చెప్పడం జరిగింది. యూనిట్ సభ్యులు ఎంతో మంది ఈ వేడుకలో పాల్గొన్నారు.

సినిమాకు సంబంధించిన వారు మాత్రమే కాకుండా సినిమాకు సంబంధం లేని వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కళ్లు చెదిరే విధంగా ప్రత్యేకంగా బ్లాక్‌ బస్టర్ సక్సెస్ వేడుక కోసం సెట్టింగ్‌ ను వేయడం జరిగింది. ఆ వేడుక తాలూకు గ్లిమ్స్ ను విడుదల చేసి ప్రభాస్ ఫ్యాన్స్ కి కన్నుల విందు చేశారు.

సలార్ తో భారీ లాభాలను దక్కించుకున్న నిర్మాత అత్యంత ఖరీదైన సక్సెస్ వేడుక నిర్వహించారు. ఈ సక్సెస్ వేడుక కి సంబంధించిన గ్లిమ్స్ ను విడుదల చేయడం ద్వారా ఎప్పుడెప్పుడు ఈ కార్యక్రమం ఫుల్ వీడియో చూస్తామా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రభాస్ తో పాటు శృతి హాసన్‌, పృథ్వీరాజ్ సుకమారన్‌ ఇంకా దర్శక నిర్మాతలతో పాటు ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యొక్క పూర్తి వీడియోను ఏదైనా ప్రముఖ ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.