Begin typing your search above and press return to search.

వైరల్‌ వీడియో : కటౌట్ తో 'సలార్‌' రికార్డ్‌

ఆ విషయం పక్కన పెడితే ముంబై లోని అత్యంత రద్దీ ఏరియాలో ఉండే ఆర్ మాల్‌ వద్ద 120 అడుగుల ఎత్తయిన ప్రభాస్ కటౌట్‌ ను ఏర్పాటు చేశారు.

By:  Tupaki Desk   |   18 Dec 2023 7:39 AM GMT
వైరల్‌ వీడియో : కటౌట్ తో సలార్‌ రికార్డ్‌
X

ప్రభాస్ అభిమానులు, పాన్‌ ఇండియా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'సలార్‌'. రెండేళ్ల ఎదురుచూపులకు తెర పడే సమయం ఆసన్నం అయింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌ 22న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది.. అందుకు సంబంధించిన ప్రమోషన్స్‌ జరుగుతున్నాయి.

సాధారణంగా ఇంత భారీ బడ్జెట్‌ సినిమాకి ప్రమోషన్‌ ఓ రేంజ్‌ లో హడావుడి, హంగామా ఉండాలి. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ ను నిరుత్సాహ పరిచే విధంగా ప్రమోషన్‌ కార్యక్రమాలు ఉన్నాయి. సినిమాకు వచ్చిన పాజిటివ్‌ బజ్ మరియు ఇప్పటికే దక్కిన పబ్లిసిటీ కారణంగా ఎక్కువ ఖర్చు చేయకుండా సింపుల్‌ గా ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు నిర్మాతలు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆ విషయం పక్కన పెడితే ముంబై లోని అత్యంత రద్దీ ఏరియాలో ఉండే ఆర్ మాల్‌ వద్ద 120 అడుగుల ఎత్తయిన ప్రభాస్ కటౌట్‌ ను ఏర్పాటు చేశారు. భారీ కటౌట్ ఏర్పాటు చేస్తున్న వీడియో ను సోషల్‌ మీడియా లో నిర్మాణ సంస్థ హంబులే షేర్‌ చేసింది.

ప్రభాస్‌ ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు కూడా సలార్‌ భారీ కటౌట్‌ కి ఫిదా అవుతున్నారు. మిర్చి లో ప్రభాస్‌ డైలాగ్‌.. కటౌట్‌ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్ అని ఉంటుంది. ఈ కటౌట్ చూస్తూ ఉంటే సలార్‌ వెయ్యి కోట్ల వసూళ్లు ఖాయం అనిపిస్తుందని.. ఈ కటౌట్‌ లో ప్రభాస్ ను చూస్తే ఉంటే వెయ్యి కోట్ల వసూళ్లు ఖాయం అని నమ్మాల్సిందే అనిపిస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఆర్‌ మాల్ వద్ద ఇప్పటి వరకు ఏర్పాటు అయిన కటౌట్స్ లో ఇదే అతి పెద్ద కటౌట్‌ గా స్థానికులు మరియు మీడియా వర్గాల వారు చెబుతున్నారు. సలార్ విడుదల అయ్యి వసూళ్ల తో రికార్డులు సృష్టించడం ఖాయం అనుకుంటే విడుదలకు ముందే టీజర్‌, ట్రైలర్ వ్యూస్ తో పాటు ఇలా కటౌట్ తో కూడా రికార్డులు నమోదు చేయడం కేవలం సలార్ కే సాధ్యం అయింది అంటూ ఫ్యాన్స్ సోషల్‌ మీడియాలో చర్చించుకుంటున్నారు.