Begin typing your search above and press return to search.

డార్లింగ్ ఫ్యాన్స్ సంబరాలు.. సలార్ ఆయుధ పూజ

ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ ప్రభాస్ బర్త్ డే డే సందర్భంగా సలార్ మూవీ కోసం ఉపయోగించిన కత్తులతో పోస్టర్ రిలీజ్ చేసి ఆయుధ పూజకి సిద్ధం అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   23 Oct 2023 12:49 PM GMT
డార్లింగ్ ఫ్యాన్స్ సంబరాలు.. సలార్ ఆయుధ పూజ
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. కేక్ లు కట్ చేసి తమ అభిమానాన్ని తెలియజేస్తున్నారు.. డార్లింగ్ ఫ్యాన్స్ సందడి ఎలా ఉంటుందో సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.


ఇక ప్రభాస్ కి సినీ సెలబ్రిటీల నుంచి కూడా పెద్ద ఎత్తున విషెస్ వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రభాస్ ని సెలబ్రిటీలు విష్ చేస్తూ ఉన్నారు. అలాగే అలాగే నిర్మాణ సంస్థలు కూడా ట్విట్టర్ ద్వారా విషెస్ తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ ప్రభాస్ బర్త్ డే డే సందర్భంగా సలార్ మూవీ కోసం ఉపయోగించిన కత్తులతో పోస్టర్ రిలీజ్ చేసి ఆయుధ పూజకి సిద్ధం అంటూ క్యాప్షన్ ఇచ్చారు.


అలాగే ప్రభాస్ కి బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఇదిలా ఉంటే కుకట్ పల్లిలోని కైతల్ పూర్ గ్రౌండ్ లో ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ హీరోకి పెట్టని స్థాయిలో అతి పెద్ద కటౌట్ ఏర్పాటు చేశారు. ఆ కటౌట్ కి క్రేన్ ల సహాయంతో పాలాభిషేకం చేశారు. వేలాది సంఖ్యలో అభిమానులు ప్రభాస్ కటౌట్, బర్త్ డే సెలబ్రేషన్స్ చూసేందుకు ఆ మైదానానికి తరలి వెళ్ళారు.


దీంతో కైతల్ పూర్ గ్రౌండ్ అభిమానులతో జనసందోహంగా మారిపోయింది. కొంతమంది ఫ్యాన్స్ అయితే ఫ్యాన్ మేడ్ సాంగ్స్ కూడా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇవి కూడా వైరల్ అవుతున్నాయి. దీనిని బట్టి ప్రభాస్ ఫ్యాన్ బేస్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక గోదావరి జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ సంబరాలు చేస్తున్నారు.


మరో వైపు ప్రభాస్ సూపర్ హిట్ మూవీ ఛత్రపతి రీరిలీజ్ అయ్యింది. ఈ సినిమాని చూసేందుకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. ఇక కల్కి, మారుతి చిత్రాల నుంచి బర్త్ డే స్పెషల్ పోస్టర్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి వాటిని చిత్ర నిర్మాతలు రిలీజ్ చేస్తారా అనేది చూడాలి.