Begin typing your search above and press return to search.

సలార్ 2 మళ్లీ మొత్తం కొత్తగా..?

అయితే సలార్ 2 మరింత భారీగా ఉండబోతుందని తెలుస్తుంది. సలార్ 2 శౌర్యాంగ పర్వం అంటూ దేవ వర్సెస్ రాజమన్నార్ మధ్య ఫైట్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   1 March 2024 1:30 AM GMT
సలార్ 2 మళ్లీ మొత్తం కొత్తగా..?
X

ఒక కథగా చెప్పాల్సిన సినిమాను రెండు భాగాలుగా చేసి ఒక భాగాన్ని ముందు మరో భాగాన్ని మరో రెండేళ్ల తర్వాత రిలీజ్ చేస్తున్నారు. బాహుబలి నుంచి ఫాలో అవుతున్న ఈ పంథా త్వరలో రాబోతున్న పుష్ప 2, దేవర 1 ఇంకా సలార్ 2కి కూడా కొనసాగిస్తున్నారు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ 1 లాస్ట్ ఇయర్ డిసెంబర్ 22న వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

సలార్ 2 షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారు అన్నది క్లారిటీ లేదు. అయితే సలార్ 2 విషయంలో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మామూలుగా అయితే ఏదైనా సినిమా రెండు భాగాలుగా వస్తే మొదటి భాగానికి తీసిన కొన్ని రఫ్ సీన్స్ సెకండ్ పార్ట్ లో కూడా వాడుతుంటారు. పుష్ప 2 లో పుష్ప 1 లో తీసిన కొన్ని సీన్స్ ఉంటాయని తెలుస్తుంది. అయితే సలార్ 2 కి అలా జరిగే ఛాన్స్ లేదని తెలుస్తుంది.

సలార్ 2 కథ కొనసాగింపే అయినా దేవా, వరద రాజ మన్నార్ మధ్య జరిగే యుద్ధాన్ని చూపించాల్సి ఉంటుంది. సలార్ 1 లో ఈ సీన్స్ ని షూట్ చేయలేదు. అంతేకాదు సలార్ 2 కథ డిమాండ్ మేరకు ఇంకొన్ని లొకేషన్స్, సెట్స్ వేయాల్సి ఉంటుందట. అలా చూస్తే సలార్ 2 కి మళ్లీ మొత్తం కొత్త సెటప్ చేస్తారని టాక్. సలార్ 2లో సలార్ 1 సీన్స్ కి ఛాన్స్ లేదని అంటున్నారు.

అయితే సలార్ 2 మరింత భారీగా ఉండబోతుందని తెలుస్తుంది. సలార్ 2 శౌర్యాంగ పర్వం అంటూ దేవ వర్సెస్ రాజమన్నార్ మధ్య ఫైట్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది. సలార్ 2 ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న విషయాలపై ఇప్పుడప్పుడే క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదు. సలార్ 1 లో ఉన్న అన్ని పాత్రలు సలార్ 2 లో రిపీట్ అవుతాయట. సలార్ 2 కథ కేవలం దేవాతో రాజమన్నార్ ఫైట్ మాత్రమే కాదు ఇంకా చాలా సర్ ప్రైజ్ లు ఉంటాయని తెలుస్తుంది. అంతేకాదు రెబల్ స్టార్ ఫ్యాన్స్ సలార్ 2 ని ఎలా ముగిస్తాడు.. సలార్ 3 కి ఛాన్స్ ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా ఆలోచిస్తున్నారు.