Begin typing your search above and press return to search.

సలార్ 2.. మెంటల్ ఎక్కించడం ఖాయమా..?

సలార్ 2 పై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా వాటిని మరింత పెంచేలా సలార్ 2 పై ఆ సినిమాలో నటించిన తమిళ నటుడు బాబీ సింహా క్రేజీ కామెంట్స్ చేశాడు.

By:  Tupaki Desk   |   16 March 2024 11:09 AM GMT
సలార్ 2.. మెంటల్ ఎక్కించడం ఖాయమా..?
X

ప్రభాస్.. ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ 1 లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజై సూపర్ హిట్ అందుకుంది. కె.జి.ఎఫ్ రెండు భాగాల తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో చేసిన ఈ మూవీ అంచనాలకు తగినట్టుగానే వచ్చింది. అయితే కె.జి.ఎఫ్ రేంజ్ లో సలార్ 1 సంచలనాలు సృష్టించడంలో విఫలమైంది. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి మాత్రం సలార్ ఫుల్ మీల్స్ పెట్టేసింది. అయితే సలార్ 1 సీజ్ ఫైర్ ముగియగా.. సలార్ 1 శౌర్యాంగ పర్వం రాబోతుంది. సలార్ 1 చూసిన ఆడియన్స్ సలార్ 2 భారీ రేంజ్ లో ఊహించుకుంటున్నారు.

సలార్ 2 కథ ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య వైరాన్ని చూపించబోతున్నారు. సలార్ 2 పై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా వాటిని మరింత పెంచేలా సలార్ 2 పై ఆ సినిమాలో నటించిన తమిళ నటుడు బాబీ సింహా క్రేజీ కామెంట్స్ చేశాడు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబీ సింహా సలార్ 1 క్లైమాక్స్ లాస్ట్ 10 నిమిషాలు గూస్ బంప్స్ వచ్చేలా చేశాయి. అయితే సలార్ 2 లో ఆ ఫీల్ 100 రెట్లు హై ఉంటుందని అన్నాడు. ప్రశాంత్ నీల్ ఒక అదిరిపోయే క్లైమాక్స్ ని సిద్ధం చేశాడన్ బాబీ సింహా చెప్పుకొచ్చారు. అంతేకాదు సలార్ 2 షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నారు.

సలార్ 1 లో బాబీ సింహా రోల్ ఉన్న కొద్దిసేపైనా చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. అయితే సలార్ 2లో అతని పాత్ర మరింత బలంగా ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898 AD సినిమా పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా తర్వాత మారుతి డైరెక్షన్ లో చేస్తున్న రాజా సాబ్ సినిమాను కూడా పూర్తి చేయాలని చూస్తున్నాడు ప్రభాస్.

రాజా సాబ్ తర్వాత సలార్ 2 నే సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాడు. సలార్ 2 తప్పకుండా ఆడియన్స్ అందరినీ సర్ ప్రైజ్ చేస్తుందని క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని అంటున్నారు బాబీ సింహా. సో ఆయన కామెంట్స్ ని బట్టి చూస్తే ప్రశాంత్ నీల్ ప్రభాస్ సలార్ 2 తో మెంటల్ ఎక్కించేయడం ఖాయమని చెప్పొచ్చు.