ఆ రెండు సీక్వెళ్ల మధ్య భీకర పోరు..?
దేశ వ్యాప్తంగా క్రేజ్‌ని సొంతం చేసుకున్న స్టార్స్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ హీరోలు నటించిన క్రేజీ పాన్ ఇండియా మూవీస్ `సలార్ పార్ట్ 1 సీజ్‌ఫైర్`, `దేవర పార్ట్ 1`.
By: Tupaki Desk | 18 April 2025 12:30 PMటాలీవుడ్‌లో ఇప్పుడు సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. అందులోనూ పాన్ ఇండియా స్థాయిలో ఈ ట్రెండ్ హాట్ టాపిక్‌గా మారడంతో స్టార్ హీరోల సినిమాలపై హాట్ హాట్‌గా చర్చనడుస్తోంది. అందులోనూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ల సీక్వెళ్లపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. దేశ వ్యాప్తంగా క్రేజ్‌ని సొంతం చేసుకున్న స్టార్స్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ హీరోలు నటించిన క్రేజీ పాన్ ఇండియా మూవీస్ `సలార్ పార్ట్ 1 సీజ్‌ఫైర్`, `దేవర పార్ట్ 1`.
ఈ రెండు సినిమాల్లో ఒక్కోటి రూ.200 కోట్ల బడ్జెట్‌తో రూపొంది బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ రెండు సినిమాలకు త్వరలో సీక్వెల్స్ తెరపైకి రాబోతున్నాయి. ప్రస్తుతం వీటికి సంబంధించిన స్క్రీప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. అయితే ఈ రెండింటి మధ్య భీకరమైన పోరు, భారీ కాంపిటీషన్ నెలకొనే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి రూపొందిస్తున్న పీరియాడిక్ ఫిల్మ్ `ఫౌజీ`లో నటిస్తున్నాడు. దీనితో పాటు `కన్నప్ప`, ది రాజా సాబ్` సినిమాలు చేస్తున్నాడు. వీటి తరువాతే `సలార్` సీక్వెల్ `సలార్: పార్ట్ 2 - శౌర్యాంగ పర్వం`ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. పార్ట్ 1లో `బాహుబలి` తరహాలో అన్ని క్వశ్చన్‌లని బ్లాంక్‌గా వదిలేయడంతో పార్ట్ 2లో అసలు ఏం జరిగింది?..ఇద్రు స్నేహితుల మధ్య వైరం ఎందుకు ఏర్పడింది? పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా ఎందుకు మారాడు? `దేవరథ తండ్రి చావు వెనకున్న రహస్యం ఏంటీ? ఆ క్యారెక్టర్‌లో తండ్రిగా ప్రభాస్ మేకోవర్ ఎలా ఉండబోతోంది? వంటి అంశాలు `సలార్ 2`పై అంచనాల్ని పెంచేశాయి.
రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెరపైకి రానున్న ఈ మూవీతో పాటు `దేవర` సీక్వెల్‌గా తెరపైకి రానున్న `దేవర 2`పై కూడా ఇదే స్థాయి అంచనాలు ఏర్పడ్డాయి. పార్ట్ 1లో దేవర పాత్రని తనయుడు వరద ఎందుకు చంపాడు? ఎందుకు చంచాల్సి వచ్చింది? దఆని వెనకున్న అసలు కథేంటీ? ..ఇంతకీ దేవరని నిజంగానే వరద చంపేశాడా? అనే అంశాలు `దేవర 2`పై అంచనాల్ని పెంచేశాయి. పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2 మరింత వైల్డ్‌గా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో `దేవర 2`పై అంచనాలు ఏర్పడ్డాయి. పార్ట్ 2లో సైఫ్ అలీఖాన్‌తో పాటు `యానిమల్` విలన్ బాబి డియోల్ కూడా విలన్‌గా కనిపించబోతున్నాడు.
అంతే కాకుండా శివగామి రమ్యకృష్ణ కూడా పార్ట్2లో ఓ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయబోతోంది. ఇక ఓ స్పెషల్ క్యారెక్టర్‌లో రణ్‌బీర్ కపూర్ లేదా రణ్‌వీర్ సింగ్ కనిపించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో `సలార్ 2`, దేవర 2 సీక్వెళ్ల మధ్య బాక్సాఫీస్ వద్ద బీకర పోరు ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయి. దేనికదే ప్రత్యేకతలతో తెరపైకి రాబోతున్న ఈ రెండు సీక్వెల్స్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయం అని ఇన్ సైడ్ టాక్.