Begin typing your search above and press return to search.

ఇద్దరు ప్రిన్స్‌ ల హీరోయిన్‌ ఇప్పుడేం చేస్తుంది?

ఇటీవల మలయాళ హిట్‌ సినిమాలతో టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇస్తున్న వారు చాలా మంది ఉన్నారు. కనుక సాక్షి వైద్య కి టాలీవుడ్‌ లో రీ ఎంట్రీ దక్కేనా చూడాలి.

By:  Tupaki Desk   |   11 April 2024 5:06 AM GMT
ఇద్దరు ప్రిన్స్‌ ల హీరోయిన్‌ ఇప్పుడేం చేస్తుంది?
X

అక్కినేని ప్రిన్స్ అఖిల్‌ తో ఏజెంట్‌ సినిమాలో మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో గాండీవ దారి అర్జున సినిమాలో నటించిన ముద్దుగుమ్మ సాక్షి వైద్య కి ఒక్క విజయం కూడా టాలీవుడ్‌ లో దక్కలేదు. ఇద్దరు ప్రముఖ యంగ్‌ హీరోలకు జోడీగా నటించినా కూడా ఫలితం దక్కలేదు.

రెండు బ్యాక్ టు బ్యాక్‌ ఫ్లాప్స్‌ పడటంతో సాక్షి వైద్య ను తెలుగు ఫిల్మ్‌ మేకర్స్ పట్టించుకోవడం లేదు. ఆమె అందంతో పాటు అభినయం విషయంలో మంచి మార్కులు దక్కించుకున్నా కూడా అదృష్టం కలిసి రాకపోవడంతో టాలీవుడ్‌ లో ఆఫర్లు రాలేదు. అయితే మలయాళ సినీ ఇండస్ట్రీలో ఓ ఇంట్రెస్టింగ్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది.

మ్యూజికల్‌ లవ్‌ స్టోరీగా రూపొందుతున్న 'హాల్‌' అనే సినిమాలో ఈ అమ్మడు నటిస్తుంది. ప్రశాంత్ విజయ్ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోగా షేన్‌ నిగమ్‌ నటిస్తున్నాడు. ఇష్క్‌, కుంబళంగి నైట్స్‌ ఇంకా ఆర్‌డీఎక్స్‌ సినిమాల్లో నటించడం ద్వారా మంచి గుర్తింపును షేన్‌ దక్కించుకున్నాడు.

ఈ మధ్య కాలంలో మలయాళ సినిమాలకు మంచి డిమాండ్‌ ఉంటుంది. పాన్ ఇండియా రేంజ్ లో మలయాళ సినిమాలు సూపర్‌ హిట్‌ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో సాక్షి వైద్య కి 'హాల్‌' సినిమాలో ఛాన్స్ రావడంతో కచ్చితంగా ఆమె కెరీర్ లో టర్న్‌ గా ఈ సినిమా నిలిచే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.

హాల్ సినిమా కనుక సక్సెస్‌ అయితే మళ్లీ టాలీవుడ్‌ లో కూడా ఈ అమ్మడు ఆఫర్లు దక్కించుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ఆమె సన్నిహితులు భావిస్తున్నారు. ఇటీవల మలయాళ హిట్‌ సినిమాలతో టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇస్తున్న వారు చాలా మంది ఉన్నారు. కనుక సాక్షి వైద్య కి టాలీవుడ్‌ లో రీ ఎంట్రీ దక్కేనా చూడాలి.