Begin typing your search above and press return to search.

ఏజెంట్ బ్యూటీ అక్క‌డా పరీక్షించుకుంటుందే!

'ఏజెంట్' చిత్రంతో సాక్షివైద్య హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. అమ్మ‌డికి తొలి సినిమానే అతి పెద్ద డిజాస్ట‌ర్ అందించింది

By:  Tupaki Desk   |   12 April 2024 1:30 PM GMT
ఏజెంట్ బ్యూటీ అక్క‌డా పరీక్షించుకుంటుందే!
X

'ఏజెంట్' చిత్రంతో సాక్షివైద్య హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. అమ్మ‌డికి తొలి సినిమానే అతి పెద్ద డిజాస్ట‌ర్ అందించింది. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ఫ‌లితాలు సాధించిందో తెలిసిందే. రెండవ సినిమాతోనైనా కోలుకుంటుంది? అనుకుంటే అది 'ఏజెంట్' ని మించిన అట్ట‌ర్ ప్లాన్ చిత్రంగా నిలిచింది అదే 'గాండీవ‌ధారి అర్జున‌'. ఇది భారీ అంచ‌నాల మ‌ధ్య యాక్షన్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన సినిమా ఏజెంట్ కి ఏమాత్రం త‌గ్గ‌లేదు.

ఆ ర‌కంగా రెండ‌వ సినిమా కూడా సాక్షికి ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు చూపించింది. అలాగ‌ని మూడ‌వ ఛాన్స్ రాక‌పోలేదు. మాస్ రాజా ర‌వితేజ ఆమెని ఆదుకోవ‌డానికి దిగాడు .అనుదీప్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ ఓ సినిమా చేయ‌డానికి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ నిర్మిస్తుంది. ఇందులో హీరోయిన్ గా ఆ భామ‌ని ఫైన‌ల్ చేసిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. అయితే చేతిలో ఛాన్సులున్న‌ప్పుడే ప‌క్క భాష‌ల్లో నైనా నిల‌దొక్కుకోవాలి అన్న కోణంలో అమ్మ‌డిప్పుడు మాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తుంది.

'హాల్' అనే సినిమాతో లాంచ్ అవుతున్న‌ట్లు రివీల్ చేసింది. ఇందులో షేన్ నిగ‌మ్ హీరోగా న‌టిస్తున్నాడు. ఇదొక మ్యూజిక‌ల్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా ప్ర‌శాంత్ విజ‌య్ కుమార్ తెర‌కెక్కిస్తున్నారు. హీరో పాత్ర‌కి ధీటుగా ఆమె రోల్ ఉంటుంద‌ని రివీల్ చేసింది. మ‌రి మాలీవుడ్ తో పాటు ప‌క్క‌నున్న శాండిల్ వుడ్..కోలీవుడ్ వైపు కూడా ఓ లుక్ వేస్తుందా? అన్న‌ది చూడాలి. ఈలోగా ర‌వితేజ తో చేసిన సినిమా రిలీజ్ అయి హిట్ అందుకుంటే? సాక్షికి టాలీవుడ్ లో అవ‌కాశాలు వ‌స్తాయి.

అలా కానీ ప‌క్షంలో ర‌వితేజ చిత్ర‌మే అమ్మ‌డికి చివ‌రి సినిమా అయినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. ఈ మ‌ధ్య కాలంలో ముంబైలో భామ‌లంటే మ‌ల‌యాళం..క‌న్న‌డ భామ‌లకే టాలీవుడ్ లో స‌క్సెస్ రేటు ఎక్కువ‌గా ఉంది. ఈ నేప‌థ్యంలో దర్శ‌క‌-నిర్మాత‌లు అక్క‌డ నుంచి దిగుమ‌తి చేయ‌డానికి ఎక్కువ‌గా ఆస‌క్తి చూపిస్తున్నారు. అన్న‌ట్లు సాక్షి మ‌హ‌రాష్ట్ర థానే నుంచి వ‌చ్చిన న‌టి అన్న సంగ‌తి తెలిసిందే.