Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: వ‌రి చేలో ఎంకి పిల్ల గుండె గుభేలే

ఎంకి నాయుడు మామ క‌థ‌లు ఎంత చ‌దివినా ముచ్చ‌టేస్తాయ్! ఎంకితో నాయుడు మామ రొమాన్స్ కూడా గుండెల్లో గుబులు పుట్టిస్తుంది

By:  Tupaki Desk   |   11 Nov 2023 3:00 AM GMT
ఫోటో స్టోరి: వ‌రి చేలో ఎంకి పిల్ల గుండె గుభేలే
X

ఎంకి నాయుడు మామ క‌థ‌లు ఎంత చ‌దివినా ముచ్చ‌టేస్తాయ్! ఎంకితో నాయుడు మామ రొమాన్స్ కూడా గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. అయితే ఈరోజుల్లో అలాంటి క‌థ‌లు చ‌దివేంత ఓపిక ఎవ‌రికీ లేదు. పుస్త‌కాలు చ‌దివే రోజులు కావు ఇది. యూట్యూబ్ చానెళ్లు.. సోష‌ల్ మీడియాల‌తో కుస్తీలు ప‌ట్ట‌డానికే స‌మ‌యం సరిపోదు. కానీ ఇక్క‌డ ఈ పిల్ల‌ను చూడ‌గానే వెంట‌నే ఎంకి గుర్తుకొచ్చింది. ఎంకి అలా పొలం గ‌ట్టు దిగి వ‌రి మ‌ల్లో కంకులు కోస్తోంది. గ‌ల్ల పంచె క‌ట్టి, నాగుల చ‌వితి తువ్వాలును త‌ల‌కు చుట్టి ప‌దునైన కొడ‌వ‌లితో స‌త్తా చూపిస్తోంది. అక్క‌డే గ‌ట్టు మీంచి ఎంకినే చూస్తున్న నాయుడు మామ కూడా క‌నిపిస్తున్నాడు సుమీ!


ఇంత‌కీ ఈ ఫోటోగ్రాఫ్ లో ఎంకి పిల్ల ఎవ‌రు? అంటే పేరు సాక్షి అగ‌ర్వాల్. బిగ్ బాస్ తమిళ ఫేమ్ అంటే గుర్తుకు వ‌స్తుందేమో! సాక్షి అగర్వాల్ సోషల్ మీడియాల్లోను పాపుల‌ర్. సాక్షి అగర్వాల్ తెలుగు వారికి అంతగా సుప‌రిచితం కాదు కానీ.. తమిళం, కన్నడ, మలయాళం చిత్రాలలో సుప్రసిద్ధ నటి కం మోడల్. సాక్షి మార్కెటింగ్ కన్సల్టెంట్‌గా తన వృత్తిని ప్రారంభించింది. త‌ర్వాత థియేట‌ర్ ఆర్ట్స్ లో శిక్ష‌ణ పొంది నటనలోకి వ‌చ్చింది. పార్ట్ టైమ్ మోడలింగ్ అసైన్‌మెంట్ల తో అంద‌రి దృష్టిని ఆకర్షించింది. అప్పటి నుండి దక్షిణ భారత చిత్రాలలో కొన్ని లీడ్ పాత్ర‌ల‌తో పాటు, సహాయక‌ పాత్రలను పోషించింది.


2019 లో రియాలిటీ షో బిగ్ బాస్ తమిళంలో పాల్గొంది. ఈ వేదిక‌పై అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రదర్శన తర్వాత కెరీర్ ప‌రంగా చాలా విజయవంతమైంది. న‌టిగా సాక్షి అగ్ర హీరోల సినిమాల్లో అవ‌కాశం అందుకుంది. విశ్వాసం, కుట్టి స్టోరీ, టెడ్డీ, సిండ్రెల్లా, అరణ్మనై 3,నాన్ కడవుల్ ఇల్లై వంటి చిత్రాలలో కూడా నటించింది. ది నైట్, పుర‌వై, 120 హ‌వ‌ర్స్, కురుక్కు వాజి అనే చిత్రాల్లో సాక్షి న‌టిస్తోంది. గెస్ట్ చాప్ట‌ర్ 2 అనే వెబ్ సిరీస్ లోను న‌టించింది. ఇవ‌న్నీ తదుప‌రి విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. సాక్షి ఇప్పుడు సోష‌ల్ మీడియా క్వీన్ గాను పాపుల‌ర‌వుతోంది. ఎంకి పిల్ల కాన్సెప్టుతో గుబులు రేపుతున్న ఫోటోషూట్ ఇప్పుడు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఇలా కొడ‌వ‌లి చేత‌ప‌ట్టి గ‌ట్టు మీంచి పొలంలోకి దిగి వ‌రి కంకులు కోస్తుంటే త‌స్సదియ్యా.. కుర్ర‌కారు చూపుల‌న్నీ ఎంకి పిల్ల లాంటి సాక్షిపైనే వాలిపోయాయి మ‌రి!