Begin typing your search above and press return to search.

లవ్ స్టోరీతో 500 కోట్ల రికార్డు..!

ఈ ఇయర్ బాలీవుడ్ స్టార్స్ కి సైతం షాక్ ఇచ్చేలా బాక్సాఫీస్ ని షేక్ చేసిన సినిమా సైయారా. మోహిత్ సూరి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో అహాన్ పాండే, అనీత్ పడ్డా లీడ్ రోల్స్ లో నటించారు.

By:  Tupaki Desk   |   3 Sept 2025 8:00 PM IST
లవ్ స్టోరీతో 500 కోట్ల రికార్డు..!
X

ఈ ఇయర్ బాలీవుడ్ స్టార్స్ కి సైతం షాక్ ఇచ్చేలా బాక్సాఫీస్ ని షేక్ చేసిన సినిమా సైయారా. మోహిత్ సూరి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో అహాన్ పాండే, అనీత్ పడ్డా లీడ్ రోల్స్ లో నటించారు. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బీ టౌన్ ఆడియన్స్ కి బెభత్సంగా ఎక్కేసింది. ఎంతగా అంటే స్టార్ సినిమాల రికార్డులను సైతం వెనక్కి నెట్టి రికార్డులు సృష్టించే వసూళ్లు వచ్చేలా అన్నమాట.

పెద్దగా అంచనాలు ఏమి లేకుండానే..

సైయారా సినిమా పెద్దగా అంచనాలు ఏమి లేకుండానే రిలీజైంది. ఈ సినిమా చిన్నగా యూత్ ఆడియన్స్ కి నచ్చడం అటు నుంచి బీ టౌన్ సినీ లవర్స్ ని మెప్పించడం జరిగింది. అలా అలా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్లింది. జూలై 18న రిలీజైన ఈ సినిమా రిలీజైన నెలన్నర రోజుల్లో ఏకంగా 500 కోట్ల మార్క్ టచ్ చేసి సెన్సేషనల్ రికార్డ్ అందుకుంది. ఇప్పటికీ బాలీవుడ్ లో సైయారా కొన్ని చోట్ల ప్రదర్శితమవుతుంది.

సైయారా సినిమా లవ్ స్టోరీనే.. నిజం చెప్పాలంటే అందులో కొత్తగా ఏమి ఉండదు. కానీ కొన్ని సినిమాలు సరైన టైం లో రిలీజ్ అవ్వడం వల్ల ఆడియన్స్ కి బాగా నచ్చేస్తాయి అన్నట్టుగా.. యూత్ ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ మిస్ అవుతున్నామనుకున్న టైం లో వచ్చింది సైయారా. ఇంకేముందు ఈ సినిమాను తమ భుజాన మోసేశారు ఆడియన్స్.

మోహిత్ సూరి మరో లవ్ స్టోరీ..

ఈ సినిమా కలెక్షన్స్ చూసి స్టార్స్ సైతం అవాక్కయ్యేలా చేసిందంటే ఏ రేంజ్ సక్సెస్ అందుకుందో తెలిసిందే. సైయారా సినిమా డైరెక్ట్ చేసిన మోహిత్ సూరినే మరోపక్క కార్తీక్ ఆర్యన్, శ్రీలీల తో ఒక లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఐతే ఆ సినిమా ఆషికి 3 అంటూ మీడియా చెబుతుంది కానీ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు.

ఒకవేళ అది ఆషికి 3 అయినా కూడా సైయారా రేంజ్ హిట్ అవుతుందా లేదా అన్న కన్ ఫ్యూజన్ స్టార్ట్ అయ్యింది. ఆషికి 2 సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆ సినిమా రేంజ్ లో ఆషికి 3 ఉండాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఐతే ఇప్పుడు కొత్తగా సైయారా ఒక టార్గెట్ ఫిక్స్ చేసింది. లవ్ స్టోరీ మూవీ 500 కోట్లు కలెక్షన్స్ అనేది రేర్ రికార్డ్ అలాంటి రికార్డుని మళ్లీ ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి. సినిమాలు సక్సెస్ అవ్వక బాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోతున్న టైం లో సైయారా కలెక్షన్స్ మోత మోగించింది. ఈ సినిమాతో యష్ రాజ్ ఫిలింస్ భారీ లాభాలు రాబట్టింది. సైయారా సినిమా తెలుగు రీమేక్ అంటూ మధ్య హడావిడి చేశారు. కానీ ఇప్పుడు మళ్లీ సైలెంట్ అయ్యారు. మరి సైయారా తెలుగు రీమేక్ ఉంటుందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.