Begin typing your search above and press return to search.

తెలుగు ద‌ర్శ‌కుడిపై నటి కాస్టింగ్ కౌచ్ ఆరోప‌ణ‌లు

తాజాగా న‌టి స‌యామీ కౌర్ త‌న కెరీర్ ఆరంభంలో జ‌రిగిన వేధింపుల ఘ‌ట‌న‌ను గుర్తు చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   21 May 2025 9:27 AM IST
తెలుగు ద‌ర్శ‌కుడిపై నటి కాస్టింగ్ కౌచ్ ఆరోప‌ణ‌లు
X

మీటూ ఉద్య‌మ ప‌ర్య‌వ‌సానంలో చాలా మంది న‌టీమ‌ణులు మేల్ కోస్టార్స్ పై ఆరోపిస్తూ తెర‌పైకొచ్చారు. కొంద‌రిపై కోర్టుల ప‌రిధిలో విచార‌ణ‌లు జ‌రిగాయి. ఏళ్ల త‌ర‌బ‌డి గ్యాప్ వ‌చ్చాక ఆరోపించ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం శూన్యం అని నిరూప‌ణ అయింది. ఈ కేసుల్లో పోలీసులు సాక్ష్యాధారాల‌ను స‌మ‌ర్పించ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికీ కొన్నేళ్ల క్రితం జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌ను ప్ర‌స్థావిస్తూ న‌టీమ‌ణులు కాస్టింగ్ కౌచ్ ఆరోప‌ణ‌లు చేయ‌డం హాట్ టాపిగ్గా మారుతోంది.

తాజాగా న‌టి స‌యామీ కౌర్ త‌న కెరీర్ ఆరంభంలో జ‌రిగిన వేధింపుల ఘ‌ట‌న‌ను గుర్తు చేసుకున్నారు. పాపుల‌ర్ బాలీవుడ్ వెబ్ సైట్ తో మాట్లాడుతూ స‌యామీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. త‌న‌కు 19 -20 ఏళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడు అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించ‌గా, ఆ స‌మ‌యంలో ఒక మ‌హిళా ఏజెంట్ త‌న‌ను రాజీ ప‌డాల్సిందిగా ద‌ర్శ‌కుడు కోరిన‌ట్టు తెలిపింది. అవ‌కాశం కావాలంటే రాజీ ప‌డాల‌ని ఆమె సూచించింది. ఒక మ‌హిళ ఇంకో మ‌హిళ‌తో ఈ మాట చెప్ప‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింద‌ని స‌యామీ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది.

మేడ‌మ్ మీరు ఏం చెబుతున్నారో నాకు అర్థం కావ‌డం లేద‌ని అన్నాను. నేను పదే ప‌దే దానిని రిపీట్ చేస్తూనే ఉన్నాను.. ఆపై చివరికి ఆమె ఇలా అంది. ``చూడండి.. మీరు అర్థం చేసుకోవాలి`` అని చెప్పింది. కానీ నేను ఆ మార్గంలో వెళ్లలేను. నా జీవితంలో నాకు కొన్ని ప‌రిమితులు ఉన్నాయి. ఒక మ‌హిళ ఇలా అన‌డం బాధించింది అని కూడా స‌యామీ ఇంట‌ర్వ్యూలో అన్నారు.

అయితే స‌యామీ ఖేర్ ఆ మ‌హిళా కాస్టింగ్ ఏజెంట్ ఎవ‌రో చెప్ప‌లేదు. త‌నను క‌మిట్ మెంట్ అడిగిన ద‌ర్శ‌కుడు ఎవ‌రో కూడా వెల్ల‌డించ‌లేదు. ఆమె న‌న్ను రాజీ ప‌డ‌మ‌ని చెప్పింద‌ని మాత్ర‌మే అన్నారు. స‌యామీ తెలుగు చిత్రం రేయ్‌ (2015)తో తెలుగులో నటనా రంగ ప్రవేశం చేసింది. మిర్జ్యా (2016)తో హిందీలో అరంగేట్రం చేసింది. మౌళి (2018), చోక్డ్ (2020), వైల్డ్ డాగ్ (2021), ఘూమర్ (2023) చిత్రాలలో నటించింది. ఆమె స్పెషల్ OPS (2020), ఫాదు (2022) అనే వెబ్ సిరీస్‌లలో కూడా నటించింది. బాలీవుడ్ బబుల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సయామి ఖేర్ లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు చేసారు. తెలుగు ద‌ర్శ‌కుడు క‌మిట్మెంట్ అడిగాడ‌ని గుర్తు చేసుకున్నారు.